జెట్ లీ పై వివక్ష దారుణం: మైత్రి శశి

Mythri Movie Makers and Dil Raju clash over movie release and theatre distribution issue in Telangana showing tension in Telugu film industry

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై మరియు డిస్ట్రిబ్యూషన్ పై గత కొంత కాలంగా పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కోపంగా ఉన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల విషయంలో షేరింగ్ పద్ధతికి మైత్రీ సంస్థ ఒప్పుకోలేదని మండిపడ్డారు సింగిల్ థియేటర్ల ఓనర్లు.

అయితే.. ఇవాళ విడుదలైన “జెట్ లీ” సినిమాను ఏసియన్ సినిమాస్ సంస్థకు చెందిన AMB/AAA వంటి మల్టీప్లెక్సుల్లో మరియు SVC సంస్థకి చెందిన సింగిల్ స్క్రీన్స్ లో ప్రదర్శించకపోవడమే కాకుండా, తెలంగాణలోని ఏ ఒక్క సింగిల్ స్క్రీన్ థియేటర్ కూడా ఇవ్వకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు మైత్రీ శశి.

ADVERTISEMENT

నిజానికి ఈ విషయమై గత రెండు రోజులుగా హడావుడి జరుగుతున్నా.. మైత్రీ సంస్థ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆది ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది అని వారు ఊహించి ఉండకపోదురు.

ఇక్కడ వార్ అనేది మైత్రీ వర్సెస్ డిస్ట్రిబ్యూటర్లు కాదు.. మైత్రీ వెర్సెస్ దిల్ రాజు & కో. ఈ సమస్యకి పరిష్కారం సాధించడం మైత్రీ సంస్థకి చాలా ముఖ్యం. ఎందుకంటే.. వాళ్ల ప్రొడక్షన్ లో నెక్స్ట్ అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలున్నాయి. ఆ సినిమాల విషయంలో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత మైత్రీ సంస్థ మీద ఉంది.

ADVERTISEMENT
Latest Stories