మోడీ కోసం… పవన్ వర్సెస్ నాగబాబు!

naga-babu-supports-modi-notes-banపెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న సంచలనమైన నిర్ణయం వెలువడి 12 రోజులు గడుస్తున్నప్పటికీ, ఇప్పటికీ హాట్ హాట్ గా రాజకీయాలను, సామాన్యులను కుదిపేస్తోంది. ఓ పక్క రాజ్యసభ, లోక్ సభలలో ఈ విషయంపై రాజకీయ వాతావరణం హీటేక్కగా, మరో పక్కన బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు ప్రజలు అలానే బారులు తీరుతూ కనిపిస్తున్నారు. దీంతో మోడీ నిర్ణయం పట్ల ప్రముఖులలో అభిప్రాయ బేధాలు స్పష్టంగా కనపడుతున్నాయి. విశేషమేమిటంటే… ఇప్పటివరకు మోడీ నిర్ణయాలను సమర్ధించిన వారు ఈ నోట్ల రద్దుతో విభేదించే వ్యాఖ్యలు చేస్తుండగా, మరో యాంగిల్ ఇప్పటివరకు మోడీతో సఖ్యత లేని వారు ఈ నోట్ల రద్దును స్వాగతిస్తున్నారు.

ముఖ్యంగా మెగా బ్రదర్స్ లో మోడీ నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం విశేషం. గత సార్వత్రిక ఎన్నికల నుండి మోడీపై అభిమానం కురిపిస్తూ వస్తున్న ‘జనసేన’ అధినేత ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి అభిప్రాయం తెలియజేయన్నప్పటికీ, మొన్నామధ్య అనంతరపురం పర్యటనలో భాగంగా విద్యార్ధులతో జరిగిన భేటీలో కొంతమేరకు స్పష్టత ఇవ్వగా, తాజాగా ఆదివారం నాడు చేసిన ఓ ట్వీట్ తో మోడీ నిర్ణయంపై పవన్ కు ఎలాంటి అభిప్రాయం ఉన్నదనే విషయం పూర్తి క్లారిటీ వచ్చేసినట్లయ్యింది. తన స్నేహితుడు రాసాడంటూ పవన్ పోస్ట్ చేసిన ట్వీట్ ను ‘జనసేన’ అధినేత అభిప్రాయాలుగానే పరిగణించాల్సి ఉంది.

ADVERTISEMENT

ముఖ్యంగా ఈ కావ్యంలో సామాన్యుడు బాధలను ఎక్కువగా ఏకరువు పెట్టారు. అయితే ఎన్ని బాధలైనా పడతాము, తదుపరి చర్యలు కూడా అంతే కఠినంగా ఉండాలి, పెద్దల తలలు కొట్టాలి, మాట తప్పితే ఊరుకునే ప్రసక్తే లేదంటూ పవన్ చేసిన ట్వీట్ ‘సండే సెన్సేషన్’గా మారింది. ఒక విధంగా మోడీ నిర్ణయాన్ని సమర్ధించే కన్నా, సామాన్య ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారన్న ఆవేదనే ఈ కావ్యంలో కనపడుతోంది. దీంతో పెద్ద నోట్ల రద్దు విషయాన్ని సరైన క్రమంలో అమలు చేయలేకపోతుందన్న నిర్ణయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ… మోడీ నిర్ణయాన్ని స్వాగతించడం లేదన్న భావన వ్యక్తమవుతోంది.

అయితే మరో మెగా బ్రదర్ నాగబాబు దీనికి పూర్తి విభేదంగా స్పందించారు. రాజకీయంగా నాగబాబు యాక్టివ్ కాకపోయినప్పటికీ, ప్రతి చిన్న విషయంలోనూ చిరంజీవికి అండదండలుగా ఉంటారన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ గారు అసలు ఈ నిర్ణయం గురించి పట్టించుకోకుండా షూటింగ్ చేసుకుంటుండగా, ఈ మెగా బ్రదర్ నాగబాబు మాత్రం స్పందిస్తూ… పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ప్రధాని నరేంద్ర మోడీ చరిత్రలో నిలిచిపోతారని, దేశ భవిష్యత్తును ఈ నిర్ణయం మార్చేయడం ఖాయమని, రాజకీయ నాయకులలో ఉన్న అసహనం వీడి, విమర్శలు మానుకుని, మోడీ తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరారు.

అంతేకాదు, రాబోయే ఎన్నికల నాటికి కొత్తగా ప్రవేశపెట్టిన 2000 వేల రూపాయల నోటు కూడా పూర్తిగా రద్దు చేయాలని విజ్ఞప్తి చేసారు. ఒక పౌరుడిగా నాగబాబు ఈ అభిప్రాయాలను వ్యక్తపరిచి ఉండవచ్చు గానీ, అదే రోజు మరో మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ దీనికి పూర్తి వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. ఒకప్పుడు మెగా సోదరులంతా ఒకే మాట మీద ఉండేవారన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమయ్యేది. కానీ, పవన్ ‘జనసేన’ స్థాపనతో అంతా తారుమారైపోయింది. ఒకరు వ్యక్తపరిచిన భావాలకు, మరొకరు చెప్తున్న అభిప్రాయాలకు ఎక్కడా పొంతన ఉండడం లేదు. బహుశా ‘స్వేచ్చా భారతం’ అంటే ఇదేనేమో… అనిపించే విధంగా మెగా సోదరుల అభిప్రాయాలను పోలుస్తున్నారు.మోడీ కోసం… పవన్ వర్సెస్ నాగబాబు!

పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న సంచలనమైన నిర్ణయం వెలువడి 12 రోజులు గడుస్తున్నప్పటికీ, ఇప్పటికీ హాట్ హాట్ గా రాజకీయాలను, సామాన్యులను కుదిపేస్తోంది. ఓ పక్క రాజ్యసభ, లోక్ సభలలో ఈ విషయంపై రాజకీయ వాతావరణం హీటేక్కగా, మరో పక్కన బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు ప్రజలు అలానే బారులు తీరుతూ కనిపిస్తున్నారు. దీంతో మోడీ నిర్ణయం పట్ల ప్రముఖులలో అభిప్రాయ బేధాలు స్పష్టంగా కనపడుతున్నాయి. విశేషమేమిటంటే… ఇప్పటివరకు మోడీ నిర్ణయాలను సమర్ధించిన వారు ఈ నోట్ల రద్దుతో విభేదించే వ్యాఖ్యలు చేస్తుండగా, మరో యాంగిల్ ఇప్పటివరకు మోడీతో సఖ్యత లేని వారు ఈ నోట్ల రద్దును స్వాగతిస్తున్నారు.

ముఖ్యంగా మెగా బ్రదర్స్ లో మోడీ నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం విశేషం. గత సార్వత్రిక ఎన్నికల నుండి మోడీపై అభిమానం కురిపిస్తూ వస్తున్న ‘జనసేన’ అధినేత ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి అభిప్రాయం తెలియజేయన్నప్పటికీ, మొన్నామధ్య అనంతరపురం పర్యటనలో భాగంగా విద్యార్ధులతో జరిగిన భేటీలో కొంతమేరకు స్పష్టత ఇవ్వగా, తాజాగా ఆదివారం నాడు చేసిన ఓ ట్వీట్ తో మోడీ నిర్ణయంపై పవన్ కు ఎలాంటి అభిప్రాయం ఉన్నదనే విషయం పూర్తి క్లారిటీ వచ్చేసినట్లయ్యింది. తన స్నేహితుడు రాసాడంటూ పవన్ పోస్ట్ చేసిన ట్వీట్ ను ‘జనసేన’ అధినేత అభిప్రాయాలుగానే పరిగణించాల్సి ఉంది.

ముఖ్యంగా ఈ కావ్యంలో సామాన్యుడు బాధలను ఎక్కువగా ఏకరువు పెట్టారు. అయితే ఎన్ని బాధలైనా పడతాము, తదుపరి చర్యలు కూడా అంతే కఠినంగా ఉండాలి, పెద్దల తలలు కొట్టాలి, మాట తప్పితే ఊరుకునే ప్రసక్తే లేదంటూ పవన్ చేసిన ట్వీట్ ‘సండే సెన్సేషన్’గా మారింది. ఒక విధంగా మోడీ నిర్ణయాన్ని సమర్ధించే కన్నా, సామాన్య ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారన్న ఆవేదనే ఈ కావ్యంలో కనపడుతోంది. దీంతో పెద్ద నోట్ల రద్దు విషయాన్ని సరైన క్రమంలో అమలు చేయలేకపోతుందన్న నిర్ణయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ… మోడీ నిర్ణయాన్ని స్వాగతించడం లేదన్న భావన వ్యక్తమవుతోంది.

అయితే మరో మెగా బ్రదర్ నాగబాబు దీనికి పూర్తి విభేదంగా స్పందించారు. రాజకీయంగా నాగబాబు యాక్టివ్ కాకపోయినప్పటికీ, ప్రతి చిన్న విషయంలోనూ చిరంజీవికి అండదండలుగా ఉంటారన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ గారు అసలు ఈ నిర్ణయం గురించి పట్టించుకోకుండా షూటింగ్ చేసుకుంటుండగా, ఈ మెగా బ్రదర్ నాగబాబు మాత్రం స్పందిస్తూ… పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ప్రధాని నరేంద్ర మోడీ చరిత్రలో నిలిచిపోతారని, దేశ భవిష్యత్తును ఈ నిర్ణయం మార్చేయడం ఖాయమని, రాజకీయ నాయకులలో ఉన్న అసహనం వీడి, విమర్శలు మానుకుని, మోడీ తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరారు.

అంతేకాదు, రాబోయే ఎన్నికల నాటికి కొత్తగా ప్రవేశపెట్టిన 2000 వేల రూపాయల నోటు కూడా పూర్తిగా రద్దు చేయాలని విజ్ఞప్తి చేసారు. ఒక పౌరుడిగా నాగబాబు ఈ అభిప్రాయాలను వ్యక్తపరిచి ఉండవచ్చు గానీ, అదే రోజు మరో మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ దీనికి పూర్తి వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. ఒకప్పుడు మెగా సోదరులంతా ఒకే మాట మీద ఉండేవారన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమయ్యేది. కానీ, పవన్ ‘జనసేన’ స్థాపనతో అంతా తారుమారైపోయింది. ఒకరు వ్యక్తపరిచిన భావాలకు, మరొకరు చెప్తున్న అభిప్రాయాలకు ఎక్కడా పొంతన ఉండడం లేదు. బహుశా ‘స్వేచ్చా భారతం’ అంటే ఇదేనేమో… అనిపించే విధంగా మెగా సోదరుల అభిప్రాయాలను పోలుస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories