‘ఊపిరి’ సినిమా కార్యరూపం దాల్చడానికి నాగార్జున, కార్తి, పివిపి ముగ్గురు ప్రధాన కారణమని అన్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఈ సినిమాలో ఏదైనా అద్భుతం ఉంది అంటే అది నాగార్జున, కార్తీలేనని, ఈ చిత్రం షూటింగ్ మొదలైనప్పటి నుంచి నాగార్జున, కార్తీలిద్దరూ ఒకరంటే ఒకరు ఎంతో ఆప్యాయంగా ఉన్నారన్నారు. ఎంత ఆప్యాయంగా ఉన్నారని చెప్పడానికి ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పారు.
ADVERTISEMENT
“అన్నపూర్ణ ఏడెకరాల్లో ‘ఊపిరి’ చిత్రం షూటింగ్ జరుగుతున్న సందర్భంలో నాగార్జున అక్కడికి వచ్చారు. ఏమిటి కార్తీ, సైక్లింగ్ చేస్తున్నావా? అని అంటే, అందుకు కార్తీ లేదని, ఇక్కడన్నీ స్పీడు బ్రేకర్లు ఉన్నాయని చెప్పాడు. అంతే, వెంటనే మేనేజర్ కు ఫోన్ చేసి అరగంటలో వాటిని తీసేయమన్నారని, నాగార్జున – కార్తీల మధ్య బాండింగ్ కు ఇంతకన్నా నిదర్శనమేముంటుంది” అని వంశీ పైడిపల్లి అభిప్రాయపడ్డారు.
ADVERTISEMENT



