చెర్రీ ముంచాడు… బన్నీ ఏం చేస్తాడో..!

nagendra-babu-to-produce-allu-arjunఅంజనా ప్రొడక్షన్స్ పై ఒకప్పుడు భారీ చిత్రాలను నిర్మించిన చరిత్ర మెగా బ్రదర్ నాగబాబుది. అయితే ఆ స్థాయి బ్యానర్ లో నాగబాబు చివరగా నిర్మించిన సినిమా “ఆరంజ్.” మెగా వారసుడు రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఫలితం గురించి మరియు ఈ సినిమా తర్వాత నాగబాబు వ్యక్తిగత జీవితం గురించి సినీ విజ్ఞులకు తెలిసిన విషయమే. ఒక్క మాటలో చెప్పాలంటే… చెర్రీతో తీసిన ‘ఆరంజ్’ సినిమా ఒక విధంగా నాగబాబుని స్వర్గపు అంచుల దాకా తీసుకెళ్ళి వచ్చింది.

ADVERTISEMENT

అయితే ఇంతలో పవన్ కళ్యాణ్ అడ్డుపడడంతో, భువి పైనే ఉన్న నాగబాబు సినీ నిర్మాణానికి పూర్తిగా దూరంగా ఉన్నాడు. అంతేకాదు, తనకు వచ్చిన క్యారెక్టర్ లను చేసుకుంటూ, ‘జబర్దస్త్’ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే చాలా కాలం తర్వాత మళ్ళీ ఓ సినిమాకు నిర్మాతగా నాగబాబు ఎంట్రీ ఇవ్వనున్నారన్న విషయం ఖరారైంది. అయితే ఈ సారి నిర్మించేది కూడా మెగా హీరోనే… అతను మరెవరో కాదు… ప్రస్తుతం మాంచి ఊపులో ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

మరో నిర్మాత లగడపాటి శ్రీధర్ తో కలిసి నాగబాబు ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న “దువ్వాడ జగన్నాధమ్” సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుత ప్రణాళికల ప్రకారం మార్చి నుండి చిత్రీకరణ జరపాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే చెర్రీతో తీసిన సినిమా నాగబాబు జీవితాన్ని ఒక రకంగా మార్చేయగా, బన్నీతో తీయబోయే ఈ సినిమా ఈ మెగా బ్రదర్ జీవితాన్ని మరో రకంగా మారుస్తుందేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories