చంద్రబాబు గుట్టు కేసీఆర్ కు చేర్చాడా ఆయన?

Naini Narsimha Reddy - Chandrababu Naidu - L Ramanaఇదేమీ స్కాం కాదు? కేసీఆర్ ఏమి చంద్రబాబు మీద నిఘా పెట్టలేదు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఒక ఫోటో చూస్తే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, టీటీడీపీ అధ్యక్షుడు రమణ మాట్లాడుకుంటున్న మాటలు తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వినేశారా? అనిపిస్తుంది.

ADVERTISEMENT

వివరాల్లోకి వెళ్తే రేవంత్ రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరడంతో పార్టీ కార్యకలాపాలపై కీలక నేతలతో ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశం కంటే ముందే గవర్నర్ నరసింహన్ పిలుపు మేరకు రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ ముందు వరుసలో కూర్చుని ఉండగా.. వాళ్ల వెనుకే తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కూర్చున్నారు. అయితే ఈ సందర్భంగా రమణతో చంద్రబాబు చర్చిస్తుండగా వెనకే ఉన్న హోంమంత్రి నాయిని వారివైపే చూస్తూ.. ఆసక్తికరంగా వాళ్ల సంభాషణనే వింటున్నట్లుగా ఉన్న సన్నివేశం కెమెరాకు చిక్కింది. ఆ ఫోటో ఎలా ఉందంటే చంద్రబాబు రమణ ఏం మాట్లాడుకుంటున్నారో అని నాయని ఆసక్తి కరంగా వింటున్నట్టు ఉంది.

ADVERTISEMENT
Latest Stories