ఏపీలో నేడు జరుగనున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడానికి అమరావతి చేరుకున్న టీడీపీ నాయకులను పోలీస్ అధికారులు అడ్డుకున్నారు. దీనితో టీడీపీ హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీకి వెళ్ళే ఎమ్మెల్యే లను అడ్డుకునే అధికారం మీకెక్కడుంది అంటూ పోలీసుల పై మండిపడ్డారు.
బై బై జగన్ అంటూ నినాదాలు చేస్తూ అసెంబ్లీ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు టీడీపీ నేతలు .ఇదే వైసీపీ ప్రభుత్వానికి చివరి అసెంబ్లీ సమావేశాలంటూ, తమను చూసి జగన్ భయపడుతున్నారంటూ,ఇన్నాళ్లు పారుదల చాటున తిరిగిన ముఖ్యమంత్రి ఇప్పుడు బారిగేట్లు అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యే లను సైతం అసెంబ్లీ కి వెళ్ళకుండా అడ్డుకోవాలని చూడడం వైసీపీ ప్రభుత్వం రాజకీయాలలో నూతన సంస్కృతులకు తెరలేపుతుందంటూ వ్యాఖ్యానించారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటికి పోలవరం ఏమైందో..? జాబు కాలెండర్ ఎటు పోయిందో..? రాజధాని ఎక్కడో..?చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం ప్రజల ముందు దోషిగా నిలబడింది అన్నారు. ప్రశ్నించడానికి ప్రతిపక్షంగా మీరు ముందుకు వస్తే అధికార పార్టీ గా అడ్డుకోవడానికి మేము సిద్ధం అన్నట్లు పోలీసులతో టీడీపీ ఎమ్మెల్యే లను అడ్డుకున్నారు.
అయితే అసెంబ్లీ సమావేశాలలో ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఏమిటో ప్రశ్నించడానికి ప్రతిపక్ష పార్టీగా మేము సిద్ధం అంటూ ఆ బారిగేట్లను తోసుకుంటూ ముందుకువెళ్లారు టీడీపీ నాయకులు. మూడు రోజులపాటు జరగనున్న ఈ సమావేశాలలో అధికార – ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే జరిగే అవకాశం ఉంది.
ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో ప్రభుత్వాన్ని తమ ప్రశ్నలతో ఇటుకునపెట్టడానికి ప్రతిపక్ష పార్టీలు సిద్ధమైతే, ప్రతిపక్ష నేతల పై తమ మాటలతో మానసిక దాడి చేసి ఈ సమావేశాలను కూడా అర్థరహితంగా ముగించడానికి అధికార పార్టీ నేతలు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే వచ్చే అసెంబ్లీ సమావేశాలలో రాజకీయ నాయకుల కొట్లాటలు ఏప్రాంతంలో జరగాలో నిర్ణయించుకోవడానికి మరి ప్రజలు సిద్ధమా..?




