నందమూరి వంశంలో నాలుగో తరం సినీ రంగంలో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంది. తెలుగు సినీ ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు వారసత్వాన్ని బాలకృష్ణ పుణికిపుచ్చుకుని, స్టార్ హీరోగా ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకున్నారు. ఆ తరువాత ఆ వారసత్వాన్ని జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అందుకోగా, త్వరలో వీరి సరసన మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనుండగా, ఆ తరువాతి తరం నటుడిగా రోడ్ యాక్సిడెంట్ లో మరణించిన జానకీరామ్ తనయుడు మాస్టర్ ఎన్టీఆర్ వస్తున్నాడు.
ఇటీవల వైజాగ్ లో జరిగిన సినీ అవార్డుల వేడుకలో ఈ చిన్నారి బెస్ట్ ఛైల్డ్ ఆర్టిస్ట్ స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నాడు. బాలలతో రూపొందించిన ‘దానవీర శూరకర్ణ’ సినిమాకు గాను మాస్టర్ ఎన్టీఆర్ ను పురస్కారానికి ఆహ్వానించగా… సీట్ నుంచి లేచిన మాస్టర్ ఎన్టీఆర్.. తాతయ్య బాలకృష్ణ కాళ్లకు నమస్కరించి వేదికనెక్కాడు. అనంతరం తాతయ్య బాలకృష్ణ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నాడు. మనవడికి అవార్డు ఇస్తున్న సమయంలో బాలకృష్ణ ముఖంలో ఆనందంతో వెలిగిపోయింది.



