Nara Bhuvaneshwari Sharmila

నిన్న కేసరపల్లిలో చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కొన్ని అపురూపమైన దృశ్యాలు చూసి ప్రతీ ఒక్కరూ ఆనందంతో పులకించిపోయారు.

హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన నందమూరి బాలకృష్ణ వేదికపై కూర్చున్న చెల్లి భువనేశ్వరి వద్దకు వెళ్ళి ఆప్యాయంగా నుదుట ముద్దుపెట్టుకొని ఆశీర్వదించారు. ఆమె కూడా అన్న దీవెనలను సంతోషంగా స్వీకరించారు. అది చూసి అందరూ చప్పట్లు కొట్టి సంతోషం వ్యక్తపరిచారు.

Also Read – హైద్రాబాద్ వాసుల కష్టాలకు ఆయనే రావాలి..!

ఇక చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ ప్రమాణస్వీకారాలు చేస్తున్నప్పుడు, బ్రాహ్మణి ఆమె కుమారుడు సంతోషంతో లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. వారి వెనుక వరుసలో కూర్చున్న నందమూరి రామకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.

పవన్‌ కళ్యాణ్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆయన అర్ధాంగి అన్నా లేజ్నెవా సంతోషంతో పొంగిపోతూ చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఈరోజు కోసమే ఎదురుచూస్తున్న జనసైనికులు, వీరాభిమానుల సంతోషం అంతా ఇంతా కాదు. ఈలలు, చప్పట్లతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Also Read – రాజకీయమా? రాక్షసత్వమా?

పి‌కే ప్రమాణస్వీకారం తర్వాత నేరుగా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్రమోడీల వద్దకు వెళ్ళి వారికి పాధాభివందనం చేయబోయారు కానీ వారు వారించారు. ఆ తర్వాత వేదికపైనే ఉన్న చిరంజీవి వద్దకు వెళ్ళినప్పుడు ఆయన వారిస్తున్నా పవన్‌ కళ్యాణ్‌ పాధాభివందనం చేశారు. పవన్‌ కళ్యాణ్‌ తన అన్నకు ఇంత గౌరవం ఇవ్వడం చూసి సభాప్రాంగణం చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఇది చూసి రామ్ చరణ్‌ కూడా తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.

ప్రమాణ స్వీకారాలు ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ సమక్షంలో చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ని ఆప్యాయంగా కౌగలించుకొని ఆశీర్వదిస్తుంటే మరోసారి చప్పట్లతో దద్దరిల్లిపోయింది.

Also Read – బాధ్యతకు…బరితెగింపుకు వ్యత్యాసం..!

ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నందమూరి బాలకృష్ణ, చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ ముగ్గురూ వేదిక దిగివచ్చి నందమూరి రామకృష్ణ, ఘట్టమనేని ఆదిశేషగిరి రావు, రామ్ చరణ్‌ అదితరుల వద్దకు వచ్చి ఆప్యాయంగా పలకరించడం చూసి అందరూ ఆనందంతో పులకించిపోయారు.

ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఇన్ని భావోద్వేగాలు, ఇంత బలమైన బంధాలు, అనుబంధాలు చూస్తున్నప్పుడు అందరికీ తప్పకుండా అందరికీ జగన్‌-విజయమ్మ-షర్మిల కళ్ళ ముందు మెదిలితే ఆశ్చర్యం లేదు.

గత ఎన్నికలకు ముందు జగన్ సొంత బాబాయ్ వివేకా దారుణ హత్యకు గురైతే జగన్ వ్యవహరించిన తీరు అందరూ చూశారు. తన కోసం తన పార్టీని కాపాడటం కోసం ఎంతగానో శ్రమించిన చెల్లి షర్మిలతో, తల్లి విజయమ్మని జగన్ అవమానకరంగా పార్టీని, రాష్ట్రం కూడా వీడిపోయేలా చేశారు.

ఇటీవల జరిగిన ఎన్నికలలో చెల్లెళ్ళు షర్మిల, సునీతా రెడ్డి ఇద్దరూ జగన్మోహన్ రెడ్డిని ఎంతగా విమర్శించారో, చివరికి తల్లి విజయమ్మ కూడా కూతురికే మద్దతు పలకడం అందరూ చూశారు.

ఈవిదంగా సొంత కుటుంబ సభ్యుల ఉసురు తగిలి జగన్ ఎన్నికలలో దారుణంగా ఓడిపోయి అధికారం కోల్పోయారు.
నందమూరి, నారా, కొణిదెల కుటుంబాలు బలమైన బంధాలతో ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తూ అందరినీ మెప్పిస్తుండగా, జగన్ మాత్రం అందరినీ ద్వేషిస్తూ శత్రువులుగా మార్చుకుని చేజేతులా ఓటమిని కొని తెచ్చుకొని ఒంటరివాడుగా మిగిలిపోయారు.