chandrababu-rushikonda-palace

‘ఒరేయ్ గాడిద’ అని అంటే తిట్టిన్నట్లే! కానీ దానినే పొగడ్తగా అన్వయించుకుంటే? వైసీపి అదే చేసింది.

సిఎం చంద్రబాబు నాయుడు నిన్న ఋషికొండ ప్యాలస్‌ల వైభోగం చూసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “ప్రకృతి విధ్వంసం చేసి ఇంతగా ప్రజాధనం వృధా చేసిన జగన్‌ రాజకీయాలకు అనర్హుడు,” అంటూ తీవ్రంగా విమర్శించారు.

Also Read – అందుకు జగన్‌ని అభినందించాల్సిందే.. వారిపై జాలిపడాల్సిందే!

కానీ ఈ విమర్శలను పక్కన పెట్టేసి, సాక్షాత్ సిఎం చంద్రబాబు నాయుడు, వైయస్ జగన్‌ హయాంలో రుషికొండపై నిర్మించిన ప్రభుత్వ భవనాలను చూసి అన్ని హంగులతో మహాద్భుతంగా నిర్మించారని, వాటిపై పక్కనే ఉన్న కొండ చరియలు విరిగిపడకుండా జపాన్ టెక్నాలజీని వినియోగించారని ప్రశంశించారని వైసీపి సోషల్ మీడియాలో డప్పువేసుకుంది.

అమరావతిలో వేలకోట్లు ఖర్చు చేసి చాలా నాసిరకమైన భవనాలు నిర్మించిన చంద్రబాబు నాయుడుకి ఋషికొండపై జగన్‌ నిర్మించి ఇచ్చిన అద్భుతమైన భవనాలను చూసి ఆశ్చర్యపోయారని, దేశవిదేశాలలో ప్రముఖులు నిర్మించుకున్న భవనాలు కూడా ఋషికొండ ప్యాలస్‌కి సాటిరావని చంద్రబాబు నాయుడు మెచ్చుకున్నారని వైసీపి చెప్పుకుంది. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వ భవనాలు ఏవిదంగా నిర్మించాలో తెలుసుకో చంద్రబాబు నాయుడు,” అంటూ వైసీపి హితవు పలికింది.

Also Read – గమనిక: కొడాలి నానిని అరెస్ట్‌ చేయలేదు!

సిఎం చంద్రబాబు నాయుడు ఋషికొండపై జగన్‌ తన కోసం కట్టుకున్న ప్యాలస్‌లన్నీ కలియ తిరిగిన తర్వాత, ఇన్ని వందల కోట్లు పెట్టి కట్టిన ఇంత విలాసవంతమైన భవనాలు ప్రభుత్వం వాడుకునేందుకు పనికిరావు. అలాగని నిరుపయోగంగా వదిలేయలేము.

కనుక మంత్రులు, ప్రజలు అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వీటిని ఏం చేయాలనేది నిర్ణయిస్తామని చెప్పారు. ఇకపై సామాన్య ప్రజలను కూడా వీటిని చూసేందుకు అనుమతించి వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుంటామని చెప్పారు.

Also Read – జగన్‌ వార్ డిక్లేర్… ఇవిగో సాక్ష్యాలు!


వీటి గురించి, వీటిని నిర్మించుకున్న జగన్‌ గురించి సిఎం చంద్రబాబు నాయుడు ఏమన్నారో ఆయన మాటలలోనే విందాం.