
రాష్ట్రాలను, రాజకీయాలను, రాజకీయ నాయకులను, ప్రధానులను, ముఖ్యమంత్రులను పోల్చి చూస్తున్నప్పుడు యువతరం నాయకులను కూడా పోల్చి చూడవచ్చు.
దీనిని ఏపీ, తెలంగాణలలో టీడీపీ, బిఆర్ఎస్ పార్టీలకు పరిమితం చేసి చూస్తే అక్కడ కేటీఆర్, ఇక్కడ నారా లోకేష్ కనిపిస్తారు.
Also Read – వైసీపీ హయాంలో ‘స్మశానం’, ఇప్పుడు ‘సువర్ణం’?
ఇద్దరూ రాజకీయ వారసులుగానే రాజకీయాలలో ప్రవేశించారు. వీరిలో కేటీఆర్ తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రిగా తన సమర్దత నిరూపించుకున్నారు.
కేటీఆర్ తెలంగాణకు భారీగా పరిశ్రమలు, ఐటి కంపెనీలు, పెట్టుబడులు సాధించిపెట్టారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు షిఫ్ట్ అయితే తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్దమయ్యారు. కానీ కుదరలేదు కనుక ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ గెలిచి ఉంటే తప్పకుండా ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఉండేవారేమో?
Also Read – ఆ రెండు పార్టీలు గోదావరికి బిందెలు అడ్డం పెట్టొచ్చుగా?
కానీ కేసీఆర్ రాజకీయ తప్పిదాలకు కేటీఆర్ బలైపోయారు. కేసీఆర్ మళ్ళీ ఎప్పటికైనా రాజకీయాలలో యాక్టివ్ అవుతారో లేదో తెలీదు. అలాగని కేటీఆర్‌కి పార్టీ పగ్గాలు అప్పగిద్దామనుకుంటే కల్వకుంట్ల కవిత, హరీష్ రావులకు అభ్యంతరాలు ఉన్నాయని స్పష్టంఅవుతోంది. పైగా కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఎఫ్-1 రేసింగ్ కేసులు వారి మెడకు చుట్టుకునేలా ఉన్నాయి.
ఈ పరిస్థితిని బీజేపి అనుకూలంగా మలుచుకొని తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు మెల్లగా పావులు కదుపుతోంది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చి చూశారు కనుక వచ్చేసారి బీజేపికి ఇచ్చినా ఆశ్చర్యం లేదు.
Also Read – గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు…
కనుక ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతారనుకున్న కేటీఆర్ రాజకీయ భవిష్యత్ తండ్రి కారణంగానే ఆగమ్యగోచరంగా మారిపోగా, అహంభావంతో దురుసుగా మాట్లాడుతూ, తండ్రిలా అలా మాట్లాడటమే గొప్ప అనుకుంటూ చేజేతులా ప్రజలలో వ్యతిరేకత పెంచుకుంటున్నారు.
తెలంగాణలో రాజకీయాలు, సమీకరణాలు, కేసులు, కుటుంబంలో, పార్టీలో లుకలుకలు తదితర అనేక అంశాల కారణంగా కేటీఆర్ రాజకీయ భవిష్యత్ ఆగమ్యగోచరంగా కనిపిస్తోంది.
కేటీఆర్‌కు పూర్తిభిన్నంగా ఏపీలో నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం సాగుతోంది. మంత్రిగా, పార్టీ ముఖ్య నేతగా సమర్దత నిరూపించుకుంటూ ఒక్కో మెట్టు పైకి ఎక్కుతున్నారు.
భవిష్యత్‌లో ముఖ్యమంత్రి పదవికి పవన్ కళ్యాణ్‌తో పోటీ ఉంటుంది కనుక ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు అన్నివిదాల తాను సమర్ధుడినని నిరూపించుకునేందుకు నారా లోకేష్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయి, అధికారం కోల్పోయినా కేటీఆర్ చాలా అహంభావంతో వ్యవహరిస్తుంటే, ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ నారా లోకేష్ ఎదిగిన కొద్దీ ఒదిగి ఉంటూ అందరి మన్ననలు పొందుతున్నారు.
ఈరోజు విశాఖలో జరిగిన యోగా కార్యక్రమంలో ప్రధాని మోడీ నారా లోకేష్ పనితీరు, సమర్దతని మెచ్చుకోవడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య, చంద్రబాబు నాయుడు-ప్రధాని మోడీల మద్య సంబంధాలు మరింత బలపడటం, నేటికీ జగన్ అరాచక ధోరణితోనే రాజకీయాలు చేస్తుండటం, జగన్, వైసీపీ నేతలపై కేసులు వంటివన్నీ పరిగణనలోకి తీసుకొని చూస్తే నారా లోకేష్‌కి చాలా ఉజ్వల భవిష్యత్ ఉందనిపిస్తుంది.
నారా లోకేష్ పనితీరు, సమర్దత, వినయవిధేయతలు అన్నీ ప్రధాని మోడీ చూశారు కనుక భవిష్యత్‌లో నారా లోకేష్‌ని తన మంత్రివర్గంలోకి తీసుకున్నా ఆశ్చర్యం లేదు.