జగన్‌ పారద్రోలిన ‘రెన్యూ’ని ఏపీకి తెచ్చా: నారా లోకేష్‌

Nara Lokesh announcing ReNew company’s ₹82,000 crore investment in Andhra Pradesh

దేశంలో అన్ని రాష్ట్రాలు పరిశ్రమలు, ఐటి కంపెనీలను ఆకర్షించి రప్పించుకునేందుకు పోటీలు పడుతుంటే, వైసీపీ హయంలో ఏపీకి రావాలనుకున్నవాటిని, వచ్చిన వాటిని కూడా బెదరగొట్టి పారిపోయేలా చేశారు. ఓ ముఖ్యమంత్రి… ఓ ప్రభుత్వం సొంత రాష్ట్రానికే ఇంత ద్రోహం చేయడం చాలా విషాదమే.

అసలు అలా ఎందుకు చేశారంటే రెండు కారణాలు కనిపిస్తున్నాయి. 1. చంద్రబాబు నాయుడుపై ద్వేషం, 2. వాటిని రప్పించడం కంటే సంక్షేమ పధకాల పేరుతో డబ్బు పంచిపెడుతూ అందరూ ప్రభుత్వంపైనే ఆధారపడి ఉండేలా ఉంచితేనే ఓట్లు దండుకోవచ్చనే ఆలోచన. ఇవికాక అనేక కారణాలు కూడా ఉన్నాయి. కానీ వాటన్నిటి గురించి చెప్పుకుంటే అదో పెద్ద కధ అవుతుంది.

ADVERTISEMENT

ఇంతకీ విషయమేమిటంటే, నాడు ఆవిధంగా తరిమేసిన లేదా పారిపోయిన కంపెనీలలో ‘రెన్యూ’ కూడా ఒకటి. పునరుత్పాతక విద్యుత్‌ రంగంలో ప్రసిద్ధి గాంచిన ఈ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి ఒప్పించి మళ్ళీ ఆంధ్రాకు రప్పిస్తున్నానని మంత్రి నారా లోకేష్‌ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

ఇప్పుడీ కంపెనీ ఏపీలో రూ.82,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతోందని తెలిపారు. ఏపీని వదిలి వెళ్ళిపోయినా ఈ కంపెనీని మళ్ళీ రాష్ట్రానికి తిరిగి తీసుకువస్తున్నందుకు చాలా గర్వపడుతున్నానని మంత్రి నారా లోకేష్‌ ట్వీట్ చేశారు.

రెన్యూ కంపెనీ ఏపీలో పీవీ ఇన్‌గాట్‌ వేఫర్ ప్లాంట్‌ (6 గిగావాట్స్) హైబ్రీడ్ సైట్స్(6.3 మరియు 4.8 గిగావాట్స్ (పి), హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్‌ (2 గిగావాట్స్), గ్రీన్ హైడ్రోజన్ (300 కెటిపిఏ) ప్లాంట్స్ ఏర్పాటు చేయబోతోంది.

రేపు విశాఖలో జరుగబోయే సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయబోతున్నామని మంత్రి నారా లోకేష్‌ తెలియజేశారు.

ADVERTISEMENT
Latest Stories