ఏపీలో టీమ్‌ 11కి క్రెడిట్స్.. కోడికత్తి, గొడ్డలి

Nara Lokesh Davos Speech

ప్రస్తుతం సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ బృందం దావోస్ వాణిజ్య సదస్సులో పెట్టుబడుల వేటలో బిజీబిజీగా ఉంది. అయితే నేటికీ ఏపీలో రప్పారప్పా భయాలు నెలకొని ఉన్నందున, పెట్టుబడిదారులకి భరోసా ఇచ్చి వారికి నమ్మకం కలిగించడానికే చంద్రబాబు టీమ్‌ చాలా శ్రమించాల్సి వస్తోంది. అంటే దావోస్ సదస్సులో పెట్టుబడులు సాధించాలంటే ఏపీలో ‘గ్రౌండ్ వర్క్’ మరింత గట్టిగా చేయాల్సిన అవసరం ఉందన్న మాట!

దావోస్‌లో ప్రవాసాంధ్రులతో సమావేశంలో మంత్రి నారా లోకేష్‌ ప్రసంగం విన్నప్పుడు ఈయనేనా వైసీపీ నేతలు నాడు అవహేళన చేసింది?అని అనుమానం కలుగక మానదు.

ADVERTISEMENT

నారా లోకేష్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలు క్లుప్తంగా… “కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రజలకు చంద్రబాబు నాయుడుగారే గుర్తొస్తారు. ఆయన కష్టపడి అన్నీ చక్కదిద్దిన తర్వాత ప్రజలకు ప్రయోగాలు చేయాలనిపిస్తుంది. చేసి జగన్‌ని తెచ్చుకున్నారు.

ఏమయిందో అందరూ అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. గుజరాత్, ఓడిశా రాష్ట్రాలలో 15-20 ఏళ్ళపాటు ఒకే ప్రభుత్వం కొనసాగించడం వలన ఆ రాష్ట్రాలు ఎంతగా అభివృద్ధి సాధించాయో అందరికీ తెలుసు. ఈ 18 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయో, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయో అందరూ చూశారు.

కనుక జగన్‌ పాలనతో దెబ్బ తిన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఇలాంటి ప్రయోగాలు మానుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి.

చంద్రబాబు నాయుడు గురించి ఒకే ఒక్క మాటలో చెప్పుకోవాలంటే, ఆయనొక యూనిక్ అండ్ రేర్ పీస్. 20-30 ఏళ్ళ క్రితమే భవిష్యత్‌ ఏవిధంగా ఉండబోతోందో ఆలోచించి హైటెక్ సిటీ, ఐటి కంపెనీలు వాటిలో ఉద్యోగార్హతల కోసం ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేయించిన గొప్ప విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడుగారు.

నాడు హైదరాబాద్‌ విమానాశ్రయానికి 5,000 ఎకరాలు కావాలని అయన అంటే ఎంతో మంది ఎగతాళి చేశారు. నేడు ఆ విమానాశ్రయం ఎంతగా విస్తరించిందో చూస్తున్నాము. భోగాపురం వద్ద విమానాశ్రయం అన్నప్పుడు ఎర్రబస్సు తిరగని చోట విమనాశ్రయమా? అంటూ ఎగతాళి చేసినవారే నేడు దాని క్రెడిట్ కోసం ఆరాటపడుతున్నారు. వారి కంటే చంద్రబాబు నాయుడు చాలా దూరం ఆలోచించగలరని చెప్పేందుకు ఇంతకంటే గొప్ప ఉదాహారణ ఏముంది?

మన రాష్ట్రంలో టీమ్‌ 11 ఒకటుంది. అదెప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది. అదో ఏడ్పు గొట్టు టీమ్‌. మేము దావోస్ వస్తే ఏడుపు. పెట్టుబడులు తెస్తే ఏడ్పు. ఏపీలో పెట్టుబడులు పెట్టవద్దని ఈమెయిల్స్ చేసేది అదే. పెట్టుబడులు వస్తే ఆ క్రెడిట్ మాదేనని చెప్పుకునేది అదే టీమ్‌.

ఈ ఏడ్పుగొట్టు టీమ్‌ మొహం చూసి రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడతారు? పైగా క్రెడిట్ కావాలట! దానికీ కొన్ని క్రెడిట్స్ ఉన్నాయి. కోడికత్తి క్రెడిట్, గొడ్డలితో బాబాయ్‌ని లేపేసిన క్రెడిట్… వంటివి చాలానే ఉన్నాయి. ఆ క్రెడిట్స్ దాని సొంతం. మరెవరూ వాటిని క్లెయిమ్ చేసుకోరు కూడా,” అని మంత్రి నారా లోకేష్‌ అన్నారు.

జగన్‌ నేటికీ తెలుగులో మాట్లాడేందుకు, మీడియా ప్రశ్నలు ఎదుర్కొనేందుకు భయపడుతూ తాడేపల్లి ప్యాలస్‌లో ఎంపిక చేసిన మీడియా ముందు కూడా తడబడుతూ మాట్లాడుతుంటే, మంత్రి నారా లోకేష్‌ గల్లీ, ఢిల్లీ అనే తేడా లేకుండా దావోస్ వరకు ఇలాంటి ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. అయినని చూసి నేర్చుకోవడానికి అహం అడ్డురావచ్చు. కానీ కనీసం తడబడకుండా తెలుగులో మాట్లాడటమైన నేర్చుకుంటే బాగుంటుంది కదా?

ADVERTISEMENT
Latest Stories