శవ రాజకీయాలు, రాజకీయ అత్యాచారాలు అవసరమా?

Nara Lokesh expels leader accused in assault case

వైసీపీలో గంటా, అరగంట నేతలున్నట్లే టీడీపి లేదా మరో పార్టీలో కూడా ఉంటారు. రప్పా రప్పా తలకాయలు నరుకుదామని అనే కార్యకర్తలని సైతం జగన్‌ వెనకేసుకు వస్తుంటారు. కానీ అటువంటి వారిని టీడీపి నిర్ధాక్షిణ్యంగా పార్టీ నుంచి బహిష్కరించి చట్ట ప్రకారం చర్యలు చేపడుతుంది.

కాకినాడ జిల్లా తునిలో టీడీపికి చెందినా తాటిక నారాయణ రావు అనే వ్యక్తి తుని రూరల్ గురుకులంలో 8వ తరగతి విద్యార్ధిని తనతో స్కూటీపై బయటకు తీసుకువెళ్ళాడు. ఆ బాలికను బయటకు తీసుకువెళ్ళకుండా అడ్డుకోవలసిన హాస్టల్ వార్డెన్, అతను టీడీపి వ్యక్తి అని తెలియగానే మౌనంగా ఉండిపోయారు.

ADVERTISEMENT

నారాయణ రావు ఆ బాలికని బలవంతంగా తన స్కూటీపై హంసవనం సమీపంలోని ఓ తోటలోకి తీసుకువెళ్ళి లైంగిక దాడి చేయబోయాడు. కానీ అదే సమయంలో అటుగా వెళుతున్న స్థానికులు నారాయణరావుని చితకబాది పోలీసులకు అప్పగింఛి బాలికని రక్షించారు.

ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్‌ వెంటనే స్పందిస్తూ నారాయణ రావుని పార్టీలో నుంచి బహిష్కరించి, పొక్సో చట్టం ప్రకారం నారాయణ రావుపై కేసు నమోదు చేసి కటిన చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించారు.

తాత వయసున్న నారాయణ రావు అభం శుభం తెలీని బాలికపై అత్యాచారయత్నం చేయడం చాలా దారుణం. అతను మనోడే అని ఉపేక్షించకుండా వెంటనే కేసు నమోదు చేయించి, అరెస్ట్‌ చేయించడం అభినందనీయమే.

అతను టీడీపికి చెందిన వ్యక్తి కనుక ఈ విషయం బయటపడినప్పటి నుంచి వైసీపీ సొంత మీడియా దీనిని హైలైట్ చేస్తూ ఈ కళంకం టీడీపికి ఆపాదించాలని కుట్ర చేస్తోంది.

కానీ టీడీపిని వేలెత్తి చూపే ముందు బాబాయ్‌ని చంపిందెవరు? కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యంని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిందెవరు?వారిని వైసీపీ ఎందుకు వెనకేసుకువస్తోంది? ఇలా… టీడీపిలా వెంటనే ఎందుకు చర్యలు చేపట్టడం లేదు?అని వైసీపీలో ఎవరికీ వారు ప్రశ్నించుకోవలసిందే!

ADVERTISEMENT
Latest Stories