తండ్రి రాజకీయ వారసత్వంతో రాజకీయాలలోకి అడుగుపెట్టిన నేపో పొలిటికల్ కిడ్స్ గా బాబు తనయుడు లోకేష్, వైఎస్ఆర్ కుమారుడు జగన్, కేసీఆర్ వారసుడు కేటీఆర్ ముగ్గురు కూడా రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో తమదైన ముద్ర వేశారు.
అయితే ఇక్కడ వైఎస్ఆర్ తనయుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వైస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి రాజకీయ ఛరిష్మాను వైసీపీ పెట్టుబడిగా మార్చారు. 2019 ఏపీ ఎన్నికలలో వైసీపీ ని అధికారంలోకి తెచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు సలహాదారుల సలహాలతో పాలన చేసారు. తన హయాంలో కనీసం మంత్రులకు, ఎమ్మెల్యే లకు కూడా సమయం ఇవ్వని ముఖ్యమంత్రిగా కీర్తి మూటకట్టుకున్నారు.
ఇక కేసీఆర్ కుమారుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కేటీఆర్ గత పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా సేవలందించారు, అలాగే ఇటు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ బాధ్యతలు మోస్తున్నారు. ఇక ఇప్పుడు పార్టీ ఓటమితో కేసీఆర్ అజ్ఞాతంలో పార్టీ బరువు బాధ్యతలను పూర్తిగా భుజాన వేసుకున్నారు. పార్టీ బాధ్యతలను అన్ని తానే అయ్యి చూసుకుంటున్న కేటీఆర్ పార్టీలో సీనియర్ నాయకులకు కూడా విలువ ఇవ్వరని, కేవలం పార్టీలో తనవర్గం నేతలకు మాత్రమే అందుబాటులో ఉంటారంటూ ఆరోపణలు ఎదుర్కుంటారు.
అలాగే ఈ ఇద్దరు నేతలు కూడా తమ రాజకీయ ప్రత్యర్థుల మీద వారి వ్యక్తిగత విషయాల మీద రాజకీయం చేయడంలో ఆరితేరిపోయినవారుగా పేరు సంపాదించుకున్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉంటున్న ఈ నాయకులు కనీసం ముఖ్యమంత్రి పదవికి కూడా గౌరవం ఇవ్వలేరు. ఒకరు నేరుగా బూతులు తిడితే మరొకరు తమ పార్టీ నేతలు తిట్టినా బూతులను సమర్థిస్తారు.
అధికారంలో ఉంటే ప్రతిపక్షాలను ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీ నేతలను కించపరచడమే వీరి రాజకీయం అనేలా ఈ ఇద్దరు నేతల ప్రవర్తన ఉంటుంది. చివరిగా చంద్రబాబు రాజకీయ వారసుడిగా నారా లోకేష్ తన రాజకియ అరంగేట్రం చేసారు. అయితే 2014 నాటి టీడీపీ ప్రభుత్వంలో పంచాయితీ రాజ్ శాఖ, ఐటీ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్న లోకేష్ తాజాగా ఐటి, విద్యా శాఖ విధులు నిర్వహిస్తున్నారు.
అయితే రాజకీయ పరంగా ఈ ముగ్గురి యువ నాయకుల రాజకీయ విధానాల గురించి కాసేపు పక్కన పెడితే వ్యక్తిగతంగా ఈ ముగ్గురు నేతలు పార్టీలోని ఇతర నేతల పట్ల, ప్రత్యర్థి పార్టీ నాయకుల పట్ల ఎలా నడుచుకుంటారు, వారి పై ఎటువంటి రాజకీయ విమర్శలు చేస్తారు అనేదాని పై ద్రుష్టి పెడితే,
నారా లోకేష్ వైసీపీ అధినేత వైస్ జగన్ కు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ ఇద్దరు నేతలు తమ రాజకీయ సౌలభ్యం కోసం చివరికి తోడబుట్టిన సొంత చెల్లెళ్లతో కూడా రాజకీయ విభేదాలు సృష్టించుకుంటున్నారు, దాని ఫలితంగా రక్త సంబంధాన్ని కూడా పక్కన పెట్టి షర్మిల, కవిత మీద తమ పార్టీ సోషల్ మీడియా సాయంతో వ్యక్తిగత దాడికి తెగబడుతున్నారు.
ఇక లోకేష్ విషయానికొస్తే తనతో ఎటువంటి రక్త సంబంధం కూడా లేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తన సొంత అన్న మాదిరి భావిస్తున్నారు, అలాగే ఆ భావనకు తగ్గట్టే పవన పై తనకున్న ఆప్యాతను, అనుబంధాన్ని, గౌరవాన్ని బహిరంగ వేదికల సాక్షిగా వ్యక్తపరుస్తున్నారు.
ఇక పార్టీలోని తన తోటి నాయకుల పట్ల కూడా లోకేష్ సోదర భావంతో కలిసి మెలిసి నడుచుకుంటున్నారు. వారిని ఆప్యాయంగా తన ఇంటికి పిలిచి మరి భోజనాలు పెట్టి, పసుపుకుంకుమలిచ్చి సత్కరిస్తున్నారు. తనకన్నా పెద్దవారితో వినిమయంగా నడుచుకుంటున్నారు, తనకన్నా చిన్నవారితో అన్నలా మెలుగుతున్నారు, అలాగే తనతోటి వారితో స్నేహంగా కలిసిపోతున్నారు.
మొత్తానికి ఒక పార్టీ అధినేత తనయుడిగా కాకుండా, పార్టీ భవిష్యత్ నాయకుడిగా కాకుండా అందరిలో ఒకరిగా కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఇందుకు నేడు కర్ణాటక సభలో జరిగిన ఒక సంఘటన కూడా మంచి ఉదాహరణగా నిలిచింది. కర్ణాటకలోని సింధనూర్ ప్రాంతంలో తన తాతా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు.
అయితే అందుకు గాను ప్రత్యేక అతిధిగా వచ్చిన లోకేష్ కోసం ఆ సభ వేదిక మీద ఒక ప్రత్యేక కుర్చీని ఏర్పాటు చేసారు నిర్వహికులు. ఆ వేదిక మీద కేంద్ర మంత్రి కుమారస్వామి, ఇతర సీనియర్ నాయకులు కూడా ఉండడంతో లోకేష్ తనకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుర్చీలో వారిని ఆసినీలు కమ్మని కోరారు.
సభావేదిక మీద ఎంతమంది నేతలు ఆ కుర్చీలో లోకేష్ ని కూర్చోవాలని వారించినా అందుకు లోకేష్ సున్నితంగా తిరస్కరించి తనకోసం వేసిన కుర్చీ స్థానంలో సాధారణ కుర్చీ వేయించుకుని తన వినయాన్ని మరోసారి ప్రదర్శించారు. దీనితో ఇప్పుడు మరోసారి జగన్, కేటీఆర్ ల ప్రస్తావన తెరమీదకు వస్తుంది.




