అవును టీడీపీ యువ నేత నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వైసీపీ ఆశలను సమాధి చేస్తూ వారి మధ్య ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నారు.
మెగా స్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ ఇలా సినీ ఇండస్ట్రీ పరంగా వీళ్ళ ముగ్గురిని ఒకే వేదిక మీద చూస్తే మెగా ఫాన్స్ ఎలా అయితే సంబరాలు చేసుకుంటారో,
సేమ్ అలానే రాజకీయలలో నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను కలిసి ఒకే వేదిక మీద చూస్తే కూటమి అభిమానుల కళ్ళు కూడా ఆనందంతో నిండిపోతాయి. చంద్రబాబు, పవన్ ల మధ్య లోకేష్ రాజకీయ భవిష్యత్ ని ముడి పెట్టి టీడీపీ – జనసేనల మధ్య రాజకీయ చీలిక తేవడానికి,
తద్వారా వైసీపీ రాజకీయ లబ్ది పొందడానికి వైసీపీ సోషల్ మీడియా ఎన్నో నిద్ర లేని రాత్రులను సైతం గడుపుతూ ప్రణాళికలు వేస్తూ ఇరు పార్టీల క్యాడర్ ను రెచ్చకొట్టేలా పోస్టులు చేస్తుంది. అసలు విషయానికొస్తే., తాజాగా మెగా డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం నియామక పత్రాలను అందించేందుకు ఒక కార్యక్రమాన్ని చేపట్టనుంది.
అయితే సెప్టెంబర్ 25 న జరగనున్న ఈ కార్యక్రమానికి అతిధిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించేందుకు స్వయంగా నారా లోకేష్ అసెంబ్లీ లోని పవన్ ఛాంబర్ కి వెళ్లారు. వీటి తాలూకా పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా జరగనున్న ఈ కార్యక్రమానికి పవన్ ను ఆహ్వానించడం ద్వారా ఈ ముగ్గురు కలిసి ఒకే వేదిక మీద కనిపించే అవకాశం ఉంటుంది. ఈ నియామకాలతో సూపర్ సిక్స్ హామీలో భాగంగా మెగా డీఎస్సీ ద్వారా సుమారు 16 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కానున్నాయి.
అయితే అటు బాబు – పవన్ ల మధ్య మొదలైన ఈ స్నేహ బంధం కాస్త పవన్ – లోకేష్ ల మధ్య అన్నదమ్ముల అనుబంధానికి భీజాలు వేసాయి. ఇప్పుడు అవే మహా వృక్షం మాదిరి ఎదుగుతూ వైసీపీ ని ఎదగనివ్వకుండా చేస్తున్నాయి.
దీనితో వైసీపీ చీలిక రాజకీయాలకు చంద్రబాబు, లోకేష్, పవన్ లు ఎప్పటికప్పుడు తమ బంధాన్ని మరింత బలోపేతం చేస్తూ వైసీపీ అధికార ఆశలను సమాధి చేస్తున్నారు.





