విశాఖలో అభివృద్ధి… చూస్కో మావయ్యా

Nara Lokesh performing groundbreaking ceremonies for seven major IT and infrastructure projects in Visakhapatnam

మంత్రి నారా లోకేష్‌ కూడా నేడు విశాఖ చేరుకొని ఏడు పెద్ద ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయబోతున్నారు. ఆ వివరాలు:

1. ఐటి హిల్: 2పై ఫినోం పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (గ్లోబల్ డెవలప్‌మెంట్‌ సెంటర్‌)కు భూమిపూజ. తొలిదశలో రూ.20కోట్లు పెట్టుబడితో ఈ కంపెనీ ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 400 మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తుంది. రెండో విడతలో రూ.185 కోట్లు పెట్టుబడితో కంపెనీ విస్తరణ చేసి 2,100 మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది. ఈ కంపెనీ ఏఐ ఆధారిత సాఫ్ట్ వేర్, ఇన్నోవేషన్ రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

ADVERTISEMENT

2. ఐటి హిల్: 2పై టెక్ తమ్మిన సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ కంపెనీని భూమిపూజ. ఈ కంపెనీ లో-కోడ్, ఏఐ ఆధారిత టెక్నాలజీ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ కంపెనీకి భారత్‌, అమెరికా, బ్రిటన్, యూఏఈలలో కార్యాలయాలున్నాయి. విశాఖలో ఏర్పాటు కాబోతున్న ఈ కంపెనీలో రాబోయే 5 ఏళ్ళలో 2,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించబోతోంది.

3. ఐటి హిల్: 3పై ఐ స్పేస్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ కంపెనీకి భూమిపూజ చేస్తారు. ఇది ఐటి ప్రోడక్ట్ డెవలప్‌మెంట్‌, ఐటి ఆధారిత మెయింటేనెన్స్, ఏజంట్ ఏఐ, జనరేటివ్ ఏఐ, హెల్త్ కేర్ ఐటిఈఎస్ సేవలు అందిస్తుంది. ప్రస్తుతం దీనికి భారత్‌లో 1200 మంది అమెరికాలో 300 మంది ఉద్యోగులున్నారు. దీని వార్షిక టర్నోవర్ 60 మిలియన్ డాలర్లు.

4. ఐటి హిల్: 3పై సెయిల్స్ సాఫ్ట్ వేర్ అధ్వర్యంలో ఏర్పాటు కాబోతున్న అడ్వాన్స్‌డ్‌ సాఫ్ట్ వేర్ ఇన్నోవేషన్ అండ్ ఏఐ ఎక్స్‌లెన్స్ సెంటర్‌కు భూమి పూజ. ఇది ఏఐ, క్లౌడ్ టెక్నాలజీ ఆధారిత ఎంటర్‌ప్రైజ్‌ సొల్యూషన్స్ (సేవలు) అందిస్తుంది. ఈ కంపెనీకి భారత్‌, అమెరికా, బ్రిటన్‌లో కార్యాలయాలు క్లౌడ్ డెలివరీ కేంద్రాలు, ఆర్‌ అండ్ డీ హబ్‌లు ఉన్నాయి. విశాఖలో ఏర్పాటు కాబోతున్న ఈ కంపెనీ ద్వారా 300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి.

5. ఐటి హిల్: 3పై రహేజా ఐటి స్పేస్ & లగ్జరీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌కు భూమిపూజ. రహేజా గ్రూప్ ఈ తొలిదశలో రూ. 2,172 కోట్లు పెట్టుబడితో దీనిని ఏర్పాటు చేస్తోంది. విశాఖకు వస్తున్న అనేక ఐటి కంపెనీలకు అవసరమైన వర్క్ స్పేస్, ఆయా కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు, విశాఖ వాసుల కోసం విలాసవంతమైన ఫ్లాట్స్ నిర్మిస్తుంది. ఈ సంస్థకు హైదరాబాద్‌, బెంగళూరు, ముంబై, ఢిల్లీతో సహా దేశంలో పలు ప్రధాన నగరాలలో ఇటువంటి ఐటి స్పేస్ & లగ్జరీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్, హోటల్స్ వగైరా ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రహేజా గ్రూప్‌లో 8,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో గల ‘మైండ్ స్పేస్’లో 300 ఐటి కంపెనీలు పనిచేస్తున్నాయి.

విశాఖలో శరవేగంగా అభివృద్ధి చెందిన ఎండాడలో కపిల్ గ్రూప్ అధ్వర్యంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు మంత్రి నారా లోకేష్‌ నేడు భూమిపూజ చేస్తారు. దీనిని 75 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబోతున్నారు. దీనిలో వాణిజ్య సంస్థలు, ఐటి కంపెనీలు, పరిశ్రమల కార్యాలయాలు వగైరా ఏర్పాటవుతాయి.

ADVERTISEMENT
Latest Stories