
రాష్ట్రానికి అత్యంత కీలకమైన నియోజకవర్గాలలో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం ఒకటిగా చెప్పవచ్చు. రాజధాని అమరావతి కి అత్యంత చేరువలో, మూడు పార్టీల అధినేతల నివాసం ప్రాంతంగా ఈ మంగళగిరి సమ్ థింగ్ స్పెషల్ అన్నట్టుగా మారిపోయింది.
అయితే 2019 ఓటమికి సమాధానంగా 2024 ఎన్నికలలో నారా లోకేష్ తన ప్రత్యర్థి పార్టీ వైసీపీ అబ్యర్థి పై దాదాపు 90 వేళా ఓట్ల పైచిలుకు మెజారిటీ తో విజయం సాధించారు. అయితే కూటమి పొత్తులో అటు జనసేన, ఇటు బీజేపీ నేతలను కలుపుకుంటూ నారా లోకేష్ తన నియోజకవర్గంలో మూడు పార్టీల మధ్య ఎటువంటి విభేదాలకు తావులేకుండా అభివృద్ధి పధంలో దూసుకుపోతున్నారు.
Also Read – మద్యం కుంభకోణం: రాజకీయ కాలక్షేపమేనా?
అలాగే ఎన్నికల హామీలో భాగంగా పేదలకు ఇల్లాళ్లకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని ఆరభించారు లోకేష్. ఇందుకు గాను ఉండవల్లి లో ప్రభుత్వ భూములలో నివసించే పేద కుట్ర కుటుంబాలకు ‘పట్టా’భిషేకం చేసారు మంత్రి. తోలి విడతలో భాగంగా 3 వేల ఇళ్ల పట్టాలు పంపిణి చేయనున్నట్టు ప్రకటించిన లోకేష్ గోవింద్ అనే వ్యక్తికీ స్వయంగా పట్టా అందించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కాసేపు మీడియాతో ముచ్చటించిన లోకేష్, ఆ మీడియా సమావేశానికి మంగళగిరి జనసేన పార్టీ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాస్ రావు తో కలిసి వచ్చారు. దీనితో ఈ నియోజకవర్గంలో అధికార ఆపార్టీ ఎమ్మెల్యే గా ఉంటున్న లోకేష్ తమ మిత్ర పక్షాలకు కూడా సమాన ప్రాధాన్యత, గౌరవం ఇస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది.
Also Read – నువ్వు విష్ణువైతే.. నేను గంటా!
దీని వల్ల మంగళగిరిలో టీడీపీ, జనసేన పార్టీ ల మధ్య ఎటువంటి పొరపథ్యాలు కానీ, అధికార ఆధిపత్య ధోరణి కానీ, అలాగే ఇరుపార్టీల నాయకుల మధ్య అభద్రతా భావం కానీ దరి చేరే అవకాశం లేకుండా చేస్తున్నారు లోకేష్. లోకేష్ గెలుపులో జనసేన కష్టం కూడా ఉంది అనేలా ఆ పార్టీ నాయకులను కూడా ప్రభుత్వ కార్యక్రమాలలో భాగస్వామ్యులను చేస్తున్నారు లోకేష్.
అలాగే మంగళగిరి నియోజకవర్గంలో జనసేన నాయకులూ లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి ముందుకొస్తు మిత్ర ధర్మానికి సరైన నిర్వచనం చెపుతున్నారు మంత్రి నారా లోకేష్. తన పార్టీ క్యాడర్ ను సమన్వయ పరుచుకుంటూ, మిత్ర పక్ష పార్టీల నాయకులను కలుపుకుంటూ కూటమి బంధానికి బలమైన వారధి కడుతున్నారు లోకేష్.
Also Read – మిల్వాకీ లో ATA ఉమెన్స్ డే మరియు ఉగాది వేడుకలు
కూటమి నెగ్గిన మిగిలిన 163 నియోజకవర్గాలలో కూడా గెలుపొందిన అందరు నాయకులు తమ తమ నియోజకవర్గాలలో ఈ రకమైన రాజకీయంతో ముందుకెళితే పవన్ చెపుతున్నట్టు, బాబు భావిస్తున్నట్టు కూటమి బంధం మరో పదిహేనేళ్ళు దృఢంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.