రెండో రోజు సిఐడి విచారణ ముగించుకున్న లోకేష్ మీడియా ముందుకు వచ్చారు. చంద్రబాబు అరెస్టుతో బాబు కుటుంబానికి ఏమైనా మంచి జరిగింది అంటే అది లోకేష్ తన నాయకత్వ లక్షణాలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నిరూపించుకోగలిగారు.కుటుంబం ఆపదలో ఉన్నా, పార్టీ ప్రమాదంలో ఉన్నా, కార్యకర్తలు భయాందోళనలో ఉన్నా నేనున్నాను అనే భరోసా ఇవ్వడంలో లోకేష్ తెగువా ప్రశంసించదగ్గదే.
ఒకప్పుడు మీడియా ముందుకు వస్తే పప్పు అంటూ హేళన చేసిన వారే ఇప్పుడు మీడియా ప్రతినిధులనే చిత్తూ చేసేలా సమాధానం ఇస్తున్నారు. దీనికంతటికి కూడా ఒకరకంగా జగన్ నే కారణం అని ఒప్పుకోకతప్పదు. ఇక అసలు విషయానికి వస్తే.., సిఐడి అధికారులు రెండో రోజు విచారణలో ఏఏ ప్రశ్నలు అడిగ్గారు అంటూ అడిగిన ఓ విలేఖరికి లోకేష్ చిత్రమైన జవాబిచ్చారు.
నిన్న అడిగిన ప్రశ్నలనే అటు తిప్పి ఇటు తిప్పి వాషింగ్ మిషన్ లో వేసినట్టు మళ్ళీ అవే ప్రశ్నలు, అదే ధోరణిలో సిఐడి అధికారులు ఉన్నారంటూ లోకేష్ సదరు విలేఖరికి సమాధానం చెప్పారు.ఈ కేసుతో సంబంధం లేని తన తల్లిని ఐటీ రిటర్న్స్ సిఐడి అధికారులకు ఎలా వచ్చాయో తనకు సమాధానం కావాలి అంటూ సిఐడి బృందాన్ని లోకేష్ ప్రశ్నించినట్టు తెలిపారు.
దీనిని ఇక్కడితో వదిలిపెట్టను రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని తన తల్లి జోలికి వస్తే పరిణామాలు వేరేగా ఉంటాయి అంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు.పది రూపాయలు విలువ చేసే షేర్ ను తానూ బలవంతంగా మీ యజమాని జగన్ మాదిరి మూడు వందలకు అమ్ముకోలేదు బ్రదర్ అంటూ సాక్షి విలేఖరికి గట్టి కౌంటర్ వేశారు.
లంచ్ బ్రేక్ కు ముందు సిఐడి అధికారులు తనకు ఒక పెద్ద స్క్రీన్ వేసి బాహుబలి తరహా సినిమా చూపించారు.అయితే ఆ సినిమాలో హెరిటేజ్ కంపెనీ భూములు ఇన్నర్ రింగ్ రోడ్ మధ్యలో నుంచి వెళ్లడం మొదటి సారిగా చూశానని, కానీ హెరిటేజ్ కంపెనీ కొనుగోలు చేసిన భూముల కోసమే ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ మార్చి అవినీతి పాల్పడ్డాము అంటున్న ప్రభుత్వము, అధికారులు ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెపితే బాగుంటుంది అన్నారు.
ఎవరైనా భూములు కోల్పోతే బాధితులవుతారు కానీ అవినీతి పరులు ఎలా అవుతారో? కేసు పెట్టిన ప్రభుత్వమో, కేసులు నడిపిస్తున్న అధికారులో తెలియచేస్తే తెలుసుకుంటాం అంటూ తన గళ్ళాన్ని గట్టిగానే వినిపించారు.లోకేష్ నుండి టిడీపీ పార్టీ కానీ క్యాడర్ కానీ ఆశించేది ఇదే. ఇదే తెగువ – తెగింపు తో ప్రభుత్వ నిరంకుశ ధోరణిని ఎదిరించి లోకేష్ నిలబడగలిగితే రానున్న ఎన్నికలలో రాష్ట్రంలో పసుపు – ఎరువుల రెండు రంగుల కలయికతో మూడు రంగుల ప్రభుత్వాన్నిగద్దెదింపడం అసాధ్యమేమీ కాదు.
ముఖ్యమంత్రిగా నేను బటన్ మాత్రమే నొక్కగలుగుతాను మిగతావి మీరే చేయాలి అంటూ జగన్ బహిరంగ సభలలో తమ నాయకులకు ఆదేశాలు ఇవ్వడం పలు మార్లు చూస్తూనే వచ్చాం.అలాగే ఈ ప్రశ్నల వాషింగ్ మిషన్ బటన్ నొక్కింది కూడా ముఖ్యమంత్రి గారేనేమో! ఎందుకంటే ఆయన బటన్ నొక్కడం మాత్రమే చేయగలను మిగిలినవి అధికారులే చెయ్యాలి అని ఇక్కడ కూడా రహస్యంగా చెప్పారేమో మరి!



