చంద్రబాబు స్కిల్ స్కాం కేసుని వాయిదాలతో ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన లాజిక్స్ తో ఎదురుదాడికి సిద్ధమయ్యారు. చంద్రబాబు తో ములాఖత్ లో పాల్గొన్న నారా భువనేశ్వరి, లోకేష్ తదనంతరం మీడియాతో ములాఖత్ అయ్యారు.
చంద్రబాబు నాయుడు తన భద్రతపై అనుమానాలున్నాయి అంటూ ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తికి లేఖ రాసిన వైనంలో లోకేష్ ప్రెస్ మీట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ప్రభుత్వం అక్రమ కేసులతో బాబు ని బంధించి ఈరోజుకి 50 రోజులయ్యింది. వ్యవస్థలను మేనేజ్ చేసి ఏ తప్పూ చేయనివారిని కూడా ఇన్నిరోజులు జైల్లో నిర్బంధించవచ్చని తానూ ఇప్పుడే తెలుసుకున్నానన్నారు.
వ్యవస్థలను మేనేజ్ చెయ్యకపోతే 10 సంవత్సరాల పాటు బెయిలు మీద ఎట్టా తిరుగుతున్నారు ఈ ముఖ్యమంత్రి? వ్యవస్థలను మేనేజ్ చెయ్యకపోతే బాబాయిని గొడ్డలి పోటు వేసిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టు చెయ్యకుండా ఇక్కడి పోలీసులు ఎట్టా అడ్డుపడుతున్నారు? వ్యవస్థలను మేనేజ్ చెయ్యకపోతే ఆధారాలు చూపకుండా చంద్రబాబుని ఇన్ని రోజులు ఎలా జైల్లో నిర్బందించగలిగారు? అంటూ చాల ఘాటుగా, సూటిగా లాజిక్స్ తో కొట్టారు లోకేష్.
సామాజిక సాధికారత పేరుతో ఏసీ బస్సుల్లో తిరగడం కాదు నిజంగా ఈ ప్రభుత్వానికి సామజిక సాధికారతే ఉంటే సుధాకర్ అనే ఒక దళిత డాక్టర్ చనిపోయే పరిస్థితులు తీసుకురాగలరా? వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక మైనార్టీకి చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఉదంతాన్ని,అలాగే మిస్బా అనే బాలిక ఉదంతాన్ని ఉదాహరణలుగా చూపించారు.
అలాగే వైసీపీ అనుచరుల దాడిలో తన అక్కను రక్షించేందుకు వెళ్లిన 15 ఏళ్ళ అమర్నాధ్ గౌడ్ అనే బాలుడిని సజీవ దహనం చేసిన వ్యక్తుల పై ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది. ఇదేనా వైసీపీ ప్రభుత్వం ఏపీ ప్రజలకు అందిస్తున్న సామజిక భద్రతా? అంటూ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు లోకేష్. చంద్రబాబు కేసు తాలూకా తమ దగ్గరున్న అన్ని ఆధారాలు ప్రజా కోర్టులో పెట్టడం జరిగింది అలాగే మీడియా ముందుకు వచ్చి ఆధారాలున్నాయి అంటూ రెచ్చిపోయే ఈ వైసీపీ నేత సజ్జలకు దమ్ముంటే ఆధారాలను ప్రజల ముందుంచాలని సవాల్ చేస్తున్న అంటూ సజ్జల పై ఫైరయ్యారు.
జైల్లో బాబుని పరీక్షిస్తున్న డాక్టర్లు ఒకరోజు బాబుకి కంటి సమస్య ఉంది ఆపరేషన్ అవసరమంటూ నివేదిక ఇచ్చి 24 గడవకముందే ఆపరేషన్ కు ఇంకా సమయం ఉంది అంటూ మరో నివేదిక ఇవ్వడంతోనే తెలుస్తుంది ఈ ప్రభుత్వం తాలూకా వ్యవస్థల మేనేజింగ్ టాలెంట్ ఏమిటో! బాబు ని అరెస్టు చేయడానికి ముందు నుండి అధికారుల కాల్ డేటా అడుగుతుంటే ఎందుకు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం భయపడుతుంది? ఈ అధికారులు ఎవరికీ ఈ రిపోర్టులను చేరవేస్తున్నారో ప్రజలకు తెలియాలి అంటూ లోకేష్ ఆలోచనతో కూడిన ఆవేశంతో మాట్లాడారు.
మొత్తానికి లోకేష్ రాజకీయాలలో ఆవేశంతో పాటు ఆలోచనాత్మకంగా మాట్లాడటం,జగన్ ప్రభుత్వం వదిలేసిన లాజిక్స్ ను లోకేష్ పట్టుకుని ప్రజలకు వివరించడం చూస్తుంటే జగన్ ప్రభుత్వాన్ని లాజిక్స్ తో భలే కొట్టావ్ భయ్యా! అంటూ టీడీపీ శ్రేణులు లోకేష్ ను కొనియాడుతున్నారు.కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులు చూస్తుంటే “ఇక్కడ లాజిక్స్ కాదు ఓన్లీ మ్యాజిక్స్” మాత్రమే పనిచేస్తున్నట్టున్నాయి. అందుకే “ఇక్కడ పొలిటిషన్స్ కన్నా రౌడీలే ఎక్కువ” అంటూ పంచ్ డైలాగ్స్ పేలుస్తున్నారు.




