నారా లోకేష్‌ శంఖారావం… వైసీపికి ఒకేసారి ఇన్ని కష్టాలు ఏమిటో?

Nara Lokesh Shankharavam

యువగళం పాదయాత్రతో రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించిన టిడిపి యువనేత నారా లోకేష్‌ అది పూర్తయిన తర్వాత పార్టీ కార్యక్రమాలతో చాలా బిజీ అయిపోయారు. ఆ కారణంగా ప్రజల మద్యకు రాలేకపోయారు. దీంతో నారా లోకేష్‌ ఏమైపోయారు… ఏం చేస్తున్నారని సామాన్య ప్రజలకు కూడా సందేహాలు కలిగాయి. వాటికి జవాబుగా నారా లోకేష్‌ ‘శంఖారావం’ చేస్తూ మళ్ళీ ప్రజల మద్యకు రాబోతున్నారు.

నారా లోకేష్‌ ఈనెల 11న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల శంఖారావం పూరిస్తారు. ‘శంఖారావం’ పేరుతోనే 50 రోజులు ఉత్తరాంధ్రా జిల్లాలలో పాదయాత్ర చేస్తారు. ప్రతీరోజూ మూడు నియోజకవర్గాలలో పాదయాత్ర చేయాలని నారా లోకేష్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు ప్రజలను మరోసారి చైతన్య పరిచి, పార్టీ శ్రేణులలో ఉత్సాహం నింపడమే ఈ శంఖారావం పాదయాత్ర ఉద్దేశ్యం.

ADVERTISEMENT

దీనికి మరో కారణం కూడా ఉంది. యువగళం పాదయాత్రని ఇచ్చాపురంలో ముగించాలని నారా లోకేష్‌ అనుకున్నారు. కానీ అందరికీ తెలిసిన కారణాల వలన విశాఖలోనే ముగించాల్సి వచ్చింది.

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో యువగళం పాదయాత్ర చేయలేకపోవడంతో ఆ జిల్లాలో పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరాశ చెందారు.

ఉత్తరాంధ్రాలోని టిడిపికి చాలా కీలకమైన జిల్లాలు ఇవి. కనుక ఇప్పుడు ఆ రెండు జిల్లాలలో కూడా ఈ శంఖారావం యాత్ర చేయాలని నారా లోకేష్‌ నిర్ణయించుకున్నారు.

యువగళం పాదయాత్రతోనే నారా లోకేష్‌ ఒరిజినల్ క్యారక్టర్, పవర్, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ బయటపడ్డాయి. వాటిని చూసి రాష్ట్ర ప్రజలు ముగ్దులవగా, వైసీపి నేతలు షాక్ అయ్యారు.

కనుక సరిగ్గా ఎన్నికలకు ముందు నారా లోకేష్‌ చేస్తున్న ఈ శంఖారావం పాదయాత్రతో టిడిపి, జనసేనలకు చాలా మేలు, వైసీపికి ఇంకా నష్టం కలుగుతుంది.

ఇప్పటికే చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, దగ్గుబాటి పురందేశ్వరి, వైఎస్ షర్మిల తదితరులు, వారి పార్టీ నేతలు వైసీపిని చుట్టుముట్టి దాడి చేస్తుంటే, పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమాన్యుడిలా జగన్మోహన్‌ రెడ్డి విలవిలలాడుతున్నారు. కానీ తాను అర్జునుడినని చెప్పుకొంటున్నారు. అది వేరే సంగతి.

ఇప్పుడు నారా లోకేష్‌ కూడా శంఖారావం పాదయాత్ర మొదలుపెట్టి విమర్శిస్తుంటే అర్జునుడైనా పద్మవ్యూహంలో నుంచి బయటపడలేక ఉక్కిరిబిక్కిరికాక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories