ప్రతిపక్షం లేని అసెంబ్లీ చప్పగా సాగుతుంటే మండలిలో అటు కూటమి vs వైసీపీ అన్నట్టుగా వాడివేడి చర్చలు ఏపీ రాజకీయ వాతావరణాన్ని హీట్ ఎక్కిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ లకు చుక్కలు చూపిస్తున్నారు.
తల్లికి వదనం పథకం అమలు నుంచి మహిళల పై టీడీపీ గౌరవం వరకు లోకేష్ ఆన్ ఫైర్ అన్నట్టుగా వైసీపీ నేతలకు చమటలు పట్టిస్తున్నారు. మండలి సభలో లోకేష్ వైసీపీ మహిళా ఎమ్మెల్యే వరదు కళ్యాణి ని అవమానించారని, ఆ వ్యాఖ్యలను వెంటనే సభ రికార్డుల నుంచి తొలగించాలంటూ మండలి ప్రతిపక్ష నేత బొత్స డిమాండ్ చేసారు.
అయితే బొత్స తన పై చేసిన ఆరోపణలకు లోకేష్ చాల ధీటైన బదులిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో అసెంబ్లీ సాక్షిగా తన తల్లిని వైసీపీ నేతలు అవమానించినప్పుడు మీరంతా ఎక్కడికి వెళ్లారు.? ఆ సమయంలో తన తల్లి పడ్డ మానసిక వేదనకు తానే ప్రత్యక్ష సాక్షి అని నారా భువనేశ్వరి మనోవేదనను సభకు వినిపించారు లోకేష్.
మహిళను ఎలా గౌరవించాలో తన తల్లి తనకు నేర్పించారని, ఇప్పటికి వైసీపీ క్యాడర్ మా కుటుంబాలలోని మహిళల పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, ఒక్క టీడీపీ కార్యకర్త వైస్ జగన్ సతీమణి భారతి రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క పోస్టు పెట్టినందుకు మా నాయకుడు చంద్రబాబు అతనిని జైలుకి పంపించారని, మహిళల పై టీడీపీ గౌరవం ఆ స్థాయి లో ఉంటుందంటూ లోకేష్ బొత్స పై మండిపడ్డారు.
అలాగే ఇక తల్లికి వదనం పథకం కూడా కూటమి పాలనలో సరిగా అమలు కావడం లేదంటు ప్రశ్నను లేవనెత్తారు వైసీపీ నేతలు. అయితే ఇక్కడ ఒక వైసీపీ ఎమ్మెల్సీ తల్లికి వందనం కేవలం 63 లక్షల మందికే చేరుతుందని సభలో ప్రకటించగా మరో వైసీపీ నేత లేచి కూటమి ప్రభుత్వంలో ఈ పథకం లబ్ధిదారులు కేవలం 57 లక్షలు అంటూ మరో ప్రకటన చేసారు.
అయితే ఒకే పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్సీ లు ఇలా వేరు వేరుగా లబ్ధిదారుల సంఖ్యను మార్చడంతో వైశ్య పరిజ్ఞానం మీద వైసీపీ నేతలకున్న డొల్లతనం బయటపడినట్టయ్యింది. అలాగే కరెంట్ బిల్లు 300 యూనిట్లు దాటినా వారికీ, వైట్ రేషన్ కార్డు లేని వారికీ కూడా ఈ పథకం అమలు కావడం లేదన్న వైసీపీ నేతల ఆరోపణలకు కూడా లోకేష్ గట్టి బదులు చెప్పారు.
గత వైసీపీ ప్రభుత్వం అమ్మ ఒడికి విధించిన నియమనిబంధలే నేడు కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తుందని, అసలు రేషన్ కార్డ్ లేకపోతే పథకాల అమలు ఎలా సాధ్యం స్వామి .? అంటూ మాజీ మంత్రికి తనదైన స్టైల్ లో చురకలు అంటించారు మంత్రి నారా లోకేష్.






