మోడీకి షాక్ ఇస్తున్న నల్ల కుభేరులు!

Did Narendra Modi Lose Confidence in AP and TS BJPనల్ల డబ్బును అరికట్టడమే లక్ష్యంగా పని చేస్తోన్న మోడీ అండ్ కో కు షాక్ ఇచ్చే నివేదిక ఇది. విదేశాల్లో అక్రమంగా డబ్బును దాచుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని, 2007తో పోలిస్తే 2015 నాటికి విదేశాల్లో అక్రమ నగదు నిల్వలు 90 శాతానికి పైగా పెరిగి 4 లక్షల కోట్లకు చేరుకున్నాయని, ఇది దేశ స్ధూల జాతీయోత్పత్తిలో 3.1 శాతానికి సమానమని తాజా నివేదిక ఒకటి తెలిపింది.

అత్యధికులు నమ్ముతున్నట్టు స్విట్జర్లాండ్ లో భారత నల్లధనం అధికంగా లేదని, 53 శాతానికి పైగా భారతీయులు తాము దాచుకునే నల్లధనాన్ని హాంకాంగ్, మకావు, సింగపూర్, బహరైన్, మలేషియా వంటి ఆసియా దేశాల్లో దాస్తున్నారని బాసెల్ కేంద్రంగా పని చేస్తున్న బీఐఎస్ (బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్ మెంట్స్) ఓ రిపోర్టులో పేర్కొంది.

ADVERTISEMENT

2007లో 58 శాతం భారత నల్లధనం స్విస్ బ్యాంకుల్లో ఉండగా, 2015 నాటికి అది 31 శాతానికి ఆపై మరింతగా తగ్గిందని పేర్కొంది. ఇక ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకూ గణాంకాలను పరిశీలిస్తే, వివిధ దేశాల్లోని వారు మొత్తం 8.6 ట్రిలియన్ డాలర్లను విదేశాల్లో దాచుకున్నారని, వాటిల్లో 81 శాతం పోర్ట్ ఫోలియో సెక్యూరిటీస్ రూపంలో 19 శాతం బ్యాంకు డిపాజిట్ల రూపంలో ఉందని, ఇది ప్రపంచ జీడీపీలో 11.6 శాతానికి సమానమని పేర్కొంది.

ఇక ఆసియా దేశాల్లో 53 శాతం, స్విస్ లో 31 శాతం, కరేబియన్ దేశాల్లో 4 శాతం, యూరప్ లో (స్విస్ మినహా) 14 దేశాల్లో నల్లధనం దాగుందని యూసీఎల్ఏ ఎకానమిస్ట్ గాబ్రియేల్ జుచ్ మన్ తయారు చేసిన అధ్యయనం పేర్కొంది. దీంతో బ్లాక్ మనీని నియంత్రించాలని మోడీ సర్కారు ఎంతగా ప్రయత్నించినా, అది విఫల యత్నంగానే మిగులుతోందని అర్ధమవుతుంది.

ADVERTISEMENT
Latest Stories