మోడీ అట్టర్ ప్లాప్ షోకు నిదర్శనం!

Narendra Modi Demonetisation Failedదేశంలో పెద్ద నోట్ల రద్దు చేసి సరిగ్గా నేటికి ఏడాది పూర్తైంది. అంతే కాకుండా ఈ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నల్లధనం నియంత్రణకు అని తొలుత ప్రచారం చేసిన కేంద్ర ప్రభుత్వం, తరువాత దానిని డిజిటలైజేషన్ లో భాగమని తెలిపింది. ఈ క్రమంలో దేశంలోనే తొలి ‘క్యాష్‌ లెస్ విలేజ్‌’గా మధ్యప్రదేశ్ లోని బడంఝిరా గ్రామాన్ని ప్రకటించింది. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని దేశమంతా క్యాష్ లెస్ విధానంవైపు నడవాలని, డిజిటలైజేషన్ దిశగా మారాలని సూచించింది.

ADVERTISEMENT

ఈ సంస్కరణ ప్రవేశపెట్టిన ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ గ్రామంలో పరిస్థితులపై మీడియా ఆరా తీయగా షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. భోపాల్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో క్యాస్ లెస్ విధానం ఎప్పుడో నిలిచిపోయింది. అక్కడ ఇప్పుడు అన్నీ నగదు వ్యవహారాలే నడుస్తుండడం విశేషం. క్యాష్‌ లెస్ గ్రామంగా ప్రకటించిన సందర్భంలో ఆ ఊర్లో విరివిగా దర్శనమిచ్చిన పీఓఎస్ మిషన్లు ఇప్పుడెక్కడా కనిపించడం లేదు. ఆ మిషన్లను గ్రామస్థులు తిరిగి బ్యాంకులకు ఇచ్చేసినట్టు సమాచారం.

ఆ గ్రామంలో జరిగే నగదురహిత లావాదేవీలకు పీఓఎస్ మిషన్లు ఉంచుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భావించి వాటిని తిరిగి ఇచ్చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం క్యాష్ విధానమే నడుస్తోందని ఆ గ్రామస్థులు తెలిపారు. దీంతో కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన డిజిటలైజేషన్ అట్టర్ ఫ్లాప్ అయినట్టుగా భావించవచ్చని సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories