టిఆర్ఎస్ అనుబంద సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం సింగరేణి ఎన్నికలలో ఘనవిజయం సాధించిన, మోడీ ప్రభుత్వం దానిని దక్కనివ్వడం లేదు. గుర్తింపు పత్రం ఇవ్వడాన్ని కేంద్ర కార్మిక శాఖ నిలిపివేయడం విశేషం. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికలను ప్రబావితం చేసే విధంగా ప్రెస్ కాన్పరెన్స్ లో మాట్లాడారని ఆరోపించారు.
అదే విధంగా ఎన్నికల సందర్భంగా అక్రమాలు జరిగాయని, నగదు, వెండి గ్లాస్ లు, పళ్లాలు తదితర వస్తువులు పంపిణీ చేశారని కేంద్ర కార్మిక శాఖకు ఇతర సంఘాలు ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదుతో బిజికెఎస్ కు గుర్తింపు పత్రం ఇవ్వవద్దని ఆదేశాలు వచ్చాయి. పైగా ఈ ఆరోపణలపై విచారణ జరపాలని రీజినల్ లేబర్ కమిషనర్ కు ఆదేశాలు పంపించారు.
దీనిపై కార్మిక శాఖ ఒక సమావేశం ఏర్పాటు చేయగా, ఇతర సంఘాలు తమ వద్ద ఉన్న ఆదారాలను అదికారులకు సమర్పించారు. ఈ ఎన్నికను గనుక కేంద్ర కార్మిక శాఖ రద్దు చేస్తే అది కచ్చితంగా తెరాస గవర్నమెంట్ ను ఇబ్బంది పెట్టేదే.


