bjp-ap-telangana-chiefs

బీజేపి అధిష్టానం ఏపీ, తెలంగాణల బీజేపిలకు ఎవరూ ఊహించనివారిని అధ్యక్షులుగా ఎంపిక చేసింది. ఏపీ బీజేపికి పీవీఎన్ మాధవ్, తెలంగాణ బీజేపికి ఎన్‌ రామచందర్ రావులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించింది. ఇద్దరూ బీజేపిని బలోపేతం చేస్తామని చెప్పారు.

Also Read – అసెంబ్లీ వద్దు మీడియానే ముద్దా.?

ఏపీ కూటమి ప్రభుత్వంలో బీజేపి కూడ భాగస్వామిగా ఉంది. మూడు పార్టీల మద్య బంధం బలంగా ఉంది కూడా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య సంబంధాలు బాగున్నాయి. ఏపీలో వైసీపీ ఒడిపోయినప్పటికీ చాలా నిబ్బరంగానే, బలంగానే ఉంది.

ఏపీ బీజేపి పగ్గాలు చేపట్టిన మాధవ్‌ పెద్దగా చేయాల్సింది ఏమీ లేదనే చెప్పొచ్చు. ఏపీలో బీజేపి సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టి సభ్యుల సంఖ్య పెంచుకోవడం, పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం వంటి పనులతో కాలక్షేపం చేయక తప్పదు. ఇంతకాలం పురందేశ్వరి ఇదే చేశారు. కానీ ఆమె జగన్‌, వైసీపీలను ధీటుగా ఎదుర్కోలేకపోయారు. కనుక మాధవ్ నాయకత్వంలో ఏపీ బీజేపి వైసీపీని ధీటుగా ఎదుర్కోగలిగితే ఆయనకి, పార్టీకి ప్రజలలో గుర్తింపు, ఆదరణ పెరుగవచ్చు.

Also Read – టీడీపీ శ్రేణుల ధర్మాగ్రహం…

ఇక తెలంగాణ బీజేపి అధ్యక్షుడు ఎన్‌ రామచందర్ రావు చాలా సంక్లిష్టమైన రాజకీయాలు చేయాల్సి ఉంటుంది. అధికార కాంగ్రెస్‌ని బలంగా ఢీకొంటూనే వచ్చే ఎన్నికల నాటికి బీజేపిని గెలిపించుకునే స్థితికి తీసుకువెళ్ళాలి.

బిఆర్ఎస్ పార్టీపై కత్తులు దూస్తూ దాంతో తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్తూనే, ఆ పార్టీని బీజేపిలో విలీనం ప్రతిపాదనని ముందుకు తీసుకువెళ్ళాలి.

Also Read – రాజకీయాలలో మెట్టు దిగడం.. ఇలా కాదు!


ఒకవేళ ఈ ప్రతిపాదన వద్దనుకుంటే బిఆర్ఎస్ పార్టీని కూడా బలంగా ఢీకొంటూ వచ్చే ఎన్నికలలో పార్టీని గెలిపించుకోవాలి. ఒకవేళ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడించి గద్దె దించడమే ఏకైక లక్ష్యమనుకుంటే బిఆర్ఎస్ పార్టీతో లోపాయికారి స్నేహం తప్పదు.