ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి తన సహజ శైలికి విరుద్ధంగా రామోజీ రావు వద్దకు వెళ్లి పాదయాత్రను ఆశీర్వదించాల్సిందిగా రిక్వెస్ట్ చేసారు. వైఎస్సాఆర్ బద్ద శత్రువులా చుసిన రామోజీ రావుతో జగన్ సంధి చేసుకోవడం ఆయన మద్దత్తు దారులకు కూడా నచ్చలేదు. అయితే కాళ్ళ బేరానికి వెళ్లిన జగన్ ను ఆయన కనికరించినట్టు కనబడటం లేదు.
ఈరోజు పేపర్ లో ప్యారడైజ్ పేపర్స్ లో జగన్ పేరు ఉండటం బ్యానర్ ఐటెంగా వచ్చింది. జగన్ పాదయాత్ర ఐటెం కూడా మెయిన్ పేపర్లో కవర్ చేసిన ప్యారడైజ్ పేపర్స్ వార్తకు విస్తృత ప్రచారం కలిపించినట్టు ఉంది. దీని బట్టి కాళ్ళ బేరానికి వెళ్లిన రామోజీ రావు కనికరించలేదని టీడీపీ నాయకులు అభిమానులు ఎద్దేవా చేస్తున్నారు.
మరోవైపు జగన్ తన రెండో రోజు పాదయాత్ర కాసేపటి క్రితం ప్రారంభించారు. తొలి రోజు 8.9 కిలోమీటర్ల దూరం నడిచిన జగన్, షెడ్యూల్ ప్రకారం రెండో రోజు 12.6 కిలోమీటర్ల దూరం నడవనున్నారు. గురువారం సాయంత్రం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ వెళ్లి శుక్రవారం కోర్ట్ కు హాజరు అవుతారు.


