వైసీపీ చేసిన చారిత్రిక తప్పిదాలలో నారా లోకేష్‌ని, పవన్ కళ్యాణ్‌ని అవహేళన చేయడం ఒకటని ఒప్పుకోక తప్పదు.
పవన్ కళ్యాణ్‌ని అవహేళన చేసి చేసి కూటమి ఏర్పడటానికి, అది బలపడటానికి, వైసీపీ కాపుల ఓట్లు పోగొట్టుకోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డే. ఆదేవిదంగా నారా లోకేష్‌ని దారుణంగా అవహేళన చేసి ఆయనని కత్తిలా సాన పట్టింది కూడా జగన్మోహన్ రెడ్డే.
కనుక ఇక్కడ నీతి ఏమిటంటే, రాజకీయాలలో గంగిగోవులా ఉన్నవారిని ఎన్నడూ రెచ్చగొట్టకూడదని!
వారిరువురినీ అంతగా అవహేళన చేసి, పార్టీ నేతలతో కూడా చేయించిన జగన్ నేటికీ తాడేపల్లి ప్యాలస్‌లో దాక్కుంటే, వారిద్దరూ సభలు, కేంద్ర మంత్రులతో సమావేశాలు, మీడియా సమావేశాలతో చాలా బిజీగా ఉంటున్నారు.
మొన్న అమరావతిలో జరిగిన ‘సుపరిపాలన తొలి అడుగు 4.1 సభలో నారా లోకేష్ ప్రసంగం విన్నప్పుడు, “ఇప్పటికైనా లోకేష్‌ని చూసి నేర్చుకోండర్రా!’ అని జగన్‌కి, వైసీపీ నేతలకి చెప్పాలనిపిస్తుంది.
“ఎన్నికలలో గెలిచింది మా పార్టీలు, కూటమి కాదు.. ప్రజాస్వామ్యం.. ప్రజలే. ప్రజాస్వామ్యం శక్తి ఏమిటో అహంకారంతో మిడిసిపడిన వైసీపీకి రుచి చూపించారు. కనుక అధికారంలో ఉన్న మనమందరం కూడా ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం మంత్రులం, ఎమ్మెల్యేలం అయ్యాము కదాని కాలర్ ఎగరేసి తిరగడం కాదు. ప్రజలతో గౌరవంగా, వినయంగా వ్యవహరిస్తూ వారి సమస్యలని అడిగి తెలుసుకొని పరిష్కరించాలి.
మనం అన్ని సమస్యలు తీర్చలేకపోవచ్చు. కానీ ప్రజలను ఆప్యాయంగా పలకరించి మాట్లాడటం చాలా అవసరం. మనం మన నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలి. దాని కోసం మనలో మనమే పోటీ పడుతుండాలి. మనమందరం కలిసికట్టుగా పనిచేయాలి. అప్పుడే రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది. అది కళ్ళకు కనబడుతుంది.
అప్పుడే ఒక ఏడాది పూర్తయింది. మిగిలిన ఈ నాలుగేళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్: 1 రాష్ట్రంగా నిలబెట్టాలంటే ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేయాల్సిందే,” అని అన్నారు.
తాడేపల్లి ప్యాలస్‌లో జగన్ ప్రెస్‌మీట్ పెట్టినా, పార్టీ నేతలను పిలిపించుకున్నా, పరామర్శకు బయటకు వచ్చినా ఏం మాట్లాడుతారో.. ఎలా మాట్లాడుతారో అందరికీ తెలుసు. కానీ మంత్రి నారా లోకేష్‌లా పార్టీ శ్రేణులకు జగన్ సరైన మార్గదర్శనం చేయలేరు.
పార్టీలో అందరూ ప్రజలతో మర్యాదగా, వినయంగా వ్యవహరించాలని చెప్పరు..కేసులు పెట్టించుకోండి.. జైలుకి వెళ్ళండి.. పిల్లోళ్ళు రౌడీయిజం చేస్తే తప్పేమిటి.. రప్పా రప్పా తలలు నరుకుతామంటే తప్పేమిటి?” అంటూ జగన్ మాట్లాడుతుంటారు.
నారా లోకేష్‌లో లోపాలను ఎత్తి చూపి అవహేళన చేసి చేయించిన జగన్, నారా లోకేష్ ఎదుగుదల, ఆయనలో ఈ మార్పుని చూస్తున్నప్పటికీ, తనలో అవలక్షణాలు గుర్తించుకొని వదిలించుకుని తనని తాను తీర్చిదిద్దుకునే ఆలోచన కూడా చేయడం లేదు. కనుక వైసీపీ భవిష్యత్ జైల్లోనే కనిపిస్తోంది.
ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గత పాలకుల అహంకారం, అరాచకంతో 151 – 11 అయ్యింది. కాలర్ ఎగరేసి తిరగడం కాదు, ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రజల కోసం నిరంతరం పనిచేయాలి.#సుపరిపాలనలోతొలిఅడుగు#FirstStepRebuildingAP#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#NaraLokesh… pic.twitter.com/HfnR0RVL8F
— Telugu Desam Party (@JaiTDP) June 23, 2025




