ఒక్కడు మిగిలాడు… ధియేటర్ల గోల..!

okkadu-migiladu short of theatresఎన్ని కొత్త మల్టీప్లెక్స్ లు పుట్టుకొస్తున్నా… సినిమాల విడుదల సమయంలో ధియేటర్ల కొరత మాత్రం తీరడం లేదు. ఇదొక మాఫియాలా మారిందని చెప్పడం దర్శకనిర్మాతల వంతు అవుతుండగా, రౌడీయిజం చేస్తే ధియేటర్లు దొరకవని ధియేటర్ల యాజమాన్యం చెప్తున్నారు. సాధారణంగా చిన్న సినిమాల విడుదల సమయంలో జరిగే రచ్చ ఈ సారి మంచు మనోజ్ హీరోగా నటించిన “ఒక్కడు మిగిలాడు” విడుదల సమయంలో జరుగుతోంది.

ADVERTISEMENT

హైదరాబాద్ లోని ఏషియన్ ధియేటర్లలో తమ సినిమాను ప్రదర్శించడానికి కేటాయింపులు జరగడం లేదని చిత్ర దర్శకుడు అజయ్ సదరు ధియేటర్ అధినేత సునీల్ తో వాగ్వివాదానికి దిగారు. తమ సినిమాకు అవకాశం ఇవ్వకుండా, డబ్బింగ్ సినిమాలను ప్రదర్శించుకోవడానికి చూస్తున్నారని అజయ్ ఆరోపణలు చేయగా, ఓ వంద మందిని వెంటేసుకుని వచ్చి రౌడీయిజం చేస్తే ధియేటర్లు రావని దర్శకుడు అజయ్ తీరుపై సునీల్ విమర్శలు గుప్పించారు.

అయితే ఇది ఎప్పుడూ జరిగే ధియేటర్ల రచ్చ మాదిరి లేదని, అజయ్ – సునీల్ ల మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాల కారణంగా ఈ గోల షురూ అయ్యిందని సినీ జనాలు చెప్తున్నారు. వారిద్దరి మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఈ గొడవ మొదలైందని, మిగిలిన ఏరియాలలో గానీ, మిగిలిన మల్టీప్లెక్స్లలో గానీ ఎక్కడా “ఒక్కడు మిగిలాడు” సినిమాకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవని ట్రేడ్ వర్గీయులు స్పష్టం చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories