
ఈ మధ్య కాలంలో అటు తమిళ, ఇటు తెలుగు సినిమాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఎస్ జే.సూర్య. పవన్ కళ్యాణ్, భూమిక జంటగా నటించిన ఖుషి మూవీ తో తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమైన సూర్య, తమిళంలో మాత్రం కొన్ని సినిమాలలో హీరో గా నటించారు.
అయితే సూర్య కు హీరో గా చేసినప్పుడు రాని క్రెజ్, గుర్తింపు విలన్ గా మారినప్పుడు దక్కింది. దీనితో ఇప్పుడు విలన్ గా కొత్త అవతారం లో తెలుగు, తమిళ రెండు భాషా చిత్రాలలోనూ బిజీ నటుడిగా మారిపోయారు సూర్య.
Also Read – ఉగ్రవాదులు శ్రీనగర్‌లోనే ఇళ్ళు కట్టుకు నివసిస్తున్నా…
మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కిన స్పైడర్ మూవీలో మహేష్ కు ప్రతి నాయకుడి పాత్రలో నటించిన సూర్య తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. స్పైడర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరిచినప్పటికీ సైకో పాత్రలో సూర్య నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.
ఇక 2024 లో వచ్చిన నాని సరిపోదా శనివారం మూవీలో పోలీస్ ఆఫీసర్ దయానంద్ గా చేసిన సూర్య నటన హీరో నాని ని డామినేట్ చేసిందనే చెప్పాలి. ఒక డిఫెరెంట్ మాడ్యులేషన్ తో ఆయన చేప్పే డైలాగ్ డెలివరీ తెలుగువారిని పూర్తిగా ఆకట్టుకుంటుంది.
నన్నడుగుతాడేంటి సుధా.?, తిడుతుంటే నవ్వుదాడేంట్రా.? ఇలా సరిపోదా శనివారం సినిమా లో సూర్య నోటి నుంచి వెలువడిన ప్రతి డైలాగ్ థియేటర్లలో ప్రేక్షకలకు నవ్వు తెప్పించాయి, చప్పట్లు కొట్టేలా చేసాయి.
Also Read – ముందు టెట్ తర్వాత డీఎస్సీ నిర్వహించండి మహాప్రభో!
ఇక బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన లెజండ్ మూవీ తో అప్పటి వరకు ఫ్యామిలీ హీరో ఇమేజ్ లో కనిపించిన జగపతి బాబు ఒక్కసారిగా విలన్ అవతారంలో దర్శనిమిచ్చి థియేటర్లకు వెళ్లిన ఆడియన్స్ కు అదిదా సర్ప్రైజ్ అంటూ ఊహించని షాక్ ఇచ్చారు. దానితో అప్పటి వరకు తనకు హీరోగా రాని క్రెజ్ ఆ ఒక్క సినిమాలో విలన్ గా చేయడంతో వచ్చిందంటూ జగపతిబాబు బహిరంగానే చెప్పుకున్నారు.
అప్పటి నుంచి ఒక లెక్క ఆ తరువాత మరోలెక్క…,అన్నటుగా ఇక జగపతిబాబు విలన్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. దానితో రామ్ చరణ్ రంగస్థలం, జూ.ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ మూవీ లతో తన నటనలో ఉన్న క్రూరత్వాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసి మెప్పించారు జగపతి బాబు. ఇక లేటెస్ట్ సెన్సేషన్ కోర్ట్ చిన్న సినిమాగా వచ్చి బాక్స్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుంది.
Also Read – వైసీపీ చేపల వేట ఫలించేనా?
ఈ సినిమాలో మంగపతిగా చేసిన శివాజీ ది కూడా ఇదే పరిస్థితి. మంచోడిగా ఎన్నో సినిమాలలో నటించాను, కానీ అప్పుడు రాని పేరు, గుర్తింపు చెడ్డోడిగా చేసిన ఈ సినిమాతో నాకు దక్కిందన్నారు. దీనితో సినిమాలో విలన్ పాత్ర పట్ల ప్రేక్షకులలో ఉండే ఆసక్తి, ఆ పాత్రలో నటుడిగా వారు చేసే ఫార్ఫార్మెన్సు ఒక్కోసారి హీరో పాత్రను కూడా తగ్గిస్తుంది అనేది రుజువయ్యింది.