ఇండియానే కాదు… ప్రపంచాన్ని కుదుపుతోన్న ‘పారడైస్ పేపర్స్’

Paradise Paper Leaks tax-scamగత కొంతకాలం క్రితం ‘పనామా పేపర్స్’ పేరుతో నమోదైన సంచలనాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన వైనం తెలిసిందే. ప్రస్తుతం అదే రీతిలో అంతే కల్లోలాన్ని ‘పారడైజ్ పేపర్స్’ పేరుతో ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. న్యాయ సలహాలు అందించే ‘అప్లెబీ’ అనే సంస్థకు చెందిన డేటా లీకేజీ 714 మంది భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. 180 దేశాలకు చెందిన డేటా లీకవగా అందులో సంఖ్యా పరంగా భారత్ 19వ స్థానంలో నిలిచింది.

ADVERTISEMENT

అప్లెబీ ఖాతాదారుల్లో ప్రపంచవ్యాప్తంగా భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. 714 మంది భారతీయ కుబేరులు పన్ను ఎగ్గొట్టిన వారే కావడం గమనార్హం. పెద్ద నోట్లు రద్దు చేసి ఈ నెల 8కి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం ‘యాంటీ-బ్లాక్ మనీ డే’ను పాటిస్తోంది. దీనికి రెండు రోజుల ముందే “పారడైజ్ పేపర్స్” లీకేజీ సంచలనం సృష్టిస్తోంది. లీకైన డాక్యుమెంట్లలో అమెరికా వాణిజ్య మంత్రి విల్‌బర్ రోస్ పేరు కూడా ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అల్లుడికి చెందిన ‘నేవిగేటర్ హోల్డింగ్స్’లో ఆయనకి వాటా ఉన్నట్టు వెల్లడించింది.

ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) 13.4 మిలియన్ పేపర్లను లీక్ చేసింది. గతంలో పనామా పేపర్స్‌ను లీక్ చేసింది కూడా ఐసీఐజేనే. పన్నుల నుంచి తప్పించుకునేందుకు తమ ఆస్తులను ఎలా దాచుకున్నదీ ఈ పేపర్లలో విపులంగా ఉంది. పేపర్ల లీకేజీపై స్పందించిన ‘అప్లెబీ’ తమ సమాచారం అపహరణకు గురైందని, అయితే తమ వద్ద ఎటువంటి అవకతవకలు జరగలేని స్పష్టం చేసింది. కాగా, పనామా పేపర్స్ కుంభకోణంలో చిక్కుకున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీప్ తన పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఈ లీక్‌లో బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ పేరు కూడా ఉండడం చర్చనీయాంశమైంది. పన్నులు ఎగ్గొట్టేందుకు విదేశాల్లో సొమ్ము దాచుకున్న ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలైన నైక్, ఫేస్‌బుక్ వంటి సంస్థలతో పాటు బ్రిటన్ రాణి కూడా ఉండడం కలకలం సృష్టిస్తోంది. క్వీన్ ఎలిజబెత్ ప్రైవేట్ ఎస్టేట్ రహస్యంగా 10 మిలియన్ పౌండ్ల (రూ. 84 కోట్లు)ను విదేశాల్లో ఇన్వెస్ట్ చేసినట్టు ప్యారడైజ్ పేపర్స్ ద్వారా తెలుస్తోంది. పన్నుల నుంచి తప్పించుకునేందుకు వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడైంది.

ADVERTISEMENT
Latest Stories