పవన్ కళ్యాణ్ విమర్శలు టీడీపీకి మంచి చేశాయా?

Pawan Kalyan allegation on nara lokesh good for tdpజనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు మంత్రి లోకేష్ పై ముప్పేట దాడి చేశారు. ఎవరు ఊహించనివిధంగా ఆరోపణలు చేసి ఒకానొక టైములో ఆరోపణలు చేస్తున్నది పవన్ కళ్యాణా? లేక జగన్ మోహన్ రెడ్డా అని అనిపించేలా విమర్శలు చేసారు.

అయితే ఈ విమర్శలు ప్రజలోకి వెళ్లినా ఒకరకంగా తమకు మేలే చేశాయని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు ఇప్పటిదాకా స్తబ్దుగా ఉన్న టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యాయి. ప్రత్యర్థుల మీద తమదైన శైలిలో ముప్పేట దాడి చేస్తున్నారు.

ADVERTISEMENT

పవన్ కళ్యాణ్ దయ వల్ల ఒక ఏడాది కంటే ముందే టీడీపీ శ్రేణులను ఎన్నికల మూడ్ లోకి తీసుకెళ్లారు ఆయన. తమ నాయకుడిపై లోకేష్ పై చేస్తున్న విమర్శలపై వారు గట్టిగానే స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా టీడీపీ శ్రేణుల హవానే కనిపిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories