పవన్ ఫ్యాన్స్ అత్యుత్సాహానికి నిదర్శనం!

Pawan Kalyan Fans over action ఎంతమంది హీరోల అభిమానులు ఉన్నా… నిత్యం వార్తల్లో నిలిచేది మాత్రం ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానులే. తమ అభిమాన హీరోను ఎవరో, ఏదో విమర్శించారని అనాలోచితంగా ప్రతిస్పందించడం, సోషల్ మీడియా ద్వారా ఘాటు రిప్లైలు ఇవ్వడం రొటీన్ కార్యక్రమాలలో భాగంగా మారింది. అయితే తనను టిడిపి చంపేయడానికి ప్రయత్నిస్తోందంటూ పవన్ కళ్యాణ్ సింపతీ ఓట్ల కోసం రాజకీయ విమర్శలు చేస్తున్న రీత్యా… అభిమానులు కూడా అదే సింపతీ కోసం సోషల్ మీడియా వేదికగా చవకబారు పబ్లిసిటీకై ఆరాట పడుతున్నట్లుగా కనపడుతోంది.

పవన్ కళ్యాణ్ తో తమ పిల్లలిద్దరూ దిగిన ఫోటోలను ఫేస్ బుక్ లో ఓ యువతీ పోస్ట్ చేయగా, పవన్ ఫ్యాన్స్ ఏమో వాటిని సింపతీగా మార్చేసారు. కిడ్నీ సమస్యతో తలితండ్రులను కోల్పోయిన ఈ చిన్నారులను పవన్ కళ్యాణ్ దత్తత తీసుకున్నారంటూ సోషల్ మీడియా వేదికగా పబ్లిసిటీ చేస్తున్నారు. ఇది అలా షేర్లు చేసుకుంటూ వెళ్లి సదరు మహిళ కంట పడింది. దీంతో అదే ఫేస్ బుక్ వేదికగా సదరు మహిళ మండిపడుతూ నిజాలు తెలుసుకోమంటూ హెచ్చరించింది. మొత్తమ్మీద ‘పవన్ అండ్ కో’ సింపతీ కాన్సెప్ట్ మీద ఎక్కువగా ఆధారపడినట్లు అర్ధమవుతోంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories