రాష్ట్రానికి విడుదల చేసిన నిధులకంటే తాము చేసిన అన్యాయాన్ని కప్పిపుచ్చుకునేందుకు విడుదల చేస్తున్న నోట్లు ఎక్కువగా ఉంటున్నాయి. గతంలో 23 పేజీల నోట్స్ విడుదల చేసిన ఏపీ భాజపా అధ్యక్షుడు, విశాఖ ఎంపీ హరిబాబు మరో 18 పేజీల నోట్ శుక్రవారం దిల్లీలో విడుదల చేశారు.
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్‌కల్యాణ్ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీపై తమకు నమ్మకం లేదన్నారు. అసలైతే పవన్ కళ్యాణ్ మొదట బీజేపీ దరికే చేరారు. సోము వీర్రాజు ఆయనను వెంటపెట్టుకుని గుజరాత్లోని నరేంద్ర మోడీ వద్దకు తీసుకుని వెళ్లారు. బీజేపీకి మద్దత్తు పలికిన తరువాతే ఆయన టీడీపీకి మద్దత్తు ప్రకటించారు.
అయితే టీడీపీ ఇంకా ఆయన మీద విశ్వాసం ప్రకటిస్తుంటే బీజేపీ నమ్మకం పోయినట్టుగా ఉంది. పవన్ కళ్యాణ్ నియమించిన కమిటి వ్యతిరేకంగా రిపోర్టు ఇస్తే తమకు రాజకీయంగా ఇబ్బంది అని గ్రహించి ముందే ఆయనను పక్కన పెడుతుందా? మరోవైపు కమిటి రెండు రోజుల సమావేశం ఈరోజు హైదరాబాద్లో స్టార్ట్ అయ్యింది.






