ప్రస్తుతం కన్నడిగులకు తెలుగోళ్ల మీద, తెలుగు సినిమాల మీద ఉన్న కోపాన్ని బట్టి చూస్తుంటే.. భవిష్యత్తులో అక్కడ రిలీజ్ అవ్వబోయే సినిమాల మీద ఆ కోపం తాలుకు ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుందని స్పష్టమవుతోంది. అసలు తెలుగు ఇండస్ట్రీ నుండి నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా ఏంట్రా అని లిస్ట్ ఓపెన్ చేస్తే.. ముందు కనిపించింది నాని ప్యారడైజ్ సినిమానే.
తెలుగు సినిమాలకి కర్ణాటక మార్కెట్ 10% రెవెన్యూ షేర్ ను యాడ్ చేస్తుంది. అక్కడ కన్నడ డబ్బింగ్ లేకపోవడంతో స్ట్రయిట్ తెలుగు సినిమాలే రిలీజ్ అవుతాయి. కర్ణాటకాలో కన్నడ సినిమాలకంటే.. పరభాషా సినిమాలే బాగా ఆడతాయి కాబట్టి.. అక్కడి నుండి మన తెలుగు సినిమాలకి డిజెంట్ కలెక్షన్స్ వస్తాయి.
అయితే.. టాక్సిక్ కి తెలుగు ఇండస్ట్రీ నుండి వచ్చిన రెస్పాన్స్ పై కన్నడ సినిమా అభిమానులు చాలా కోపంగా ఉన్నారు. గతంలో “ఓజీ” సినిమా పోస్టర్లు కూడా కన్నడ భాషలో లేవని చింపేసి, థియేటర్ దగ్గర సెలబ్రేషన్స్ కూడా ఆపేసిన సందర్భాలు ఉన్నాయి.
అలాంటిది ఇంత హీట్ తర్వాత సెప్టెంబర్ 24న విడుదలవుతున్న ప్యారడైజ్ ప్రమోషన్స్ కోసం బెంగళూరు వెళ్లే హీరో నాని & టీమ్.. అక్కడి జర్నలిస్టుల నుండి, భాషాభిమాన రౌడీల నుండి అనవసరమైన డిస్కషన్స్ ఫేస్ చేసే అవకాశం లేకపోలేదు. మరి ప్యారడైజ్ టీమ్ వాటిని ఎలా ఎదుర్కొంటారు అనేది చూడాలి.
ఇదివరకు ఇలాంటి సమస్య తలెత్తలేదు. సోషల్ మీడియా యుగంలో ప్రతీ విషయానికి తమ మనోభావాలు హర్ట్ అయ్యాయి అంటూ గోల చేసే జనాల వల్లే ఇదంతా. అయినా.. ఒక్క సినిమా టాక్ & రెస్పాన్స్ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు ఏర్పడడం.. దానికి సదరు రాష్ట్ర రాజకీయ పార్టీలు వంతు పాడడం అనేది హాస్యాస్పదం.
ఆల్రెడీ నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు కన్నడ సినిమాలు కొనేది లేదు అని మొఖం మీద చెప్పేశాయి, కన్నడ దర్శకులు ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టిలు వేరే ఇండస్ట్రీలకి షిఫ్ట్ అయిపోతున్నారు, నటీనటులు కూడా బెటర్ రెమ్యునరేషన్ కోసం వేరే ఇండస్ట్రీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి తరుణంలో.. తెలుగు ఇండస్ట్రీ మీద, తెలుగోళ్ల మీద కోప్పడడం అనేది కూర్చున్న చెట్టు కొమ్మ నరుక్కోవడం లాంటిది అనేది ఈ వితండవాదులు ఎప్పటికి అర్థం చేసుకుంటారో.







