Pawan Kalyan Janasena Questions vasireddy padmaజనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్ళిళ్ళ గురించి చేసిన వ్యాఖ్యలు మహిళలను అవమానించే విదంగా ఉన్నాయని, ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నాయని కనుక బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆదేశిస్తూ ఏపీ మహిళా కమీషన్‌ ఛైర్ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ నోటీసు పంపిన సంగతి తెలిసిందే. ఊహించినట్లే దానిపై జనసేన పార్టీ చాలా ధీటుగా బదులిచ్చింది.

“వందలాది మంది ఆడబిడ్డల మానప్రాణాలు కోల్పోతుంటే, అండగా నిలబడాల్సిన అధికారంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలే కీచకులుగా మారుతుంటే, వారి నుంచి మహిళలను రక్షించకుండా దశా, దిశా లేని “దిశా ” చట్టం పేరు చెప్పి చేతులు దులుపుకుంటుంటే ఏం చేస్తుంది మహిళా కమీషన్? న్యాయం ఎక్కడ? అంటూ రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలకు గురైన మహిళల ఫోటోలతో కూడిన ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఆ తర్వాత వరుసగా 18 ట్వీట్స్ చేస్తూ వాటిలో తేదీలు, ప్రాంతాలతో సహా ఎక్కడెక్కడ, మహిళలకు అవమానాలు, హత్యలు, అత్యాచారాలకు గురయ్యారో వివరిస్తూ సాక్షాత్ మంత్రులే మహిళల పట్ల ఇంతగా అవమానకరంగా మాట్లాడుతుంటే రాష్ట్ర మహిళా కమీషన్‌ ఛైర్ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ నోరు విప్పి వారిని ప్రశ్నించలేకపోయారని, బాధిత మహిళలకు అండగా నిలబడలేకపోయారని జనసేన ఆక్షేపించింది. జనసేన సంధించిన ట్వీట్ అస్త్రాలు ఇవిగో…

Also Read – కులం కూడు పెట్టదు – కష్టం కన్నీరును మిగల్చదు!

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విజయవాడ నగరంలో 23 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? ఏం చేసింది?

దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో 32 ఏళ్ల మహిళ ఇంట్లో అనుమానాస్పదంగా హత్యకు గురైంది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

Also Read – కేసులు కావు… లంకె బిందెలవి!

మే 2022లో, బాపట్ల జిల్లాలోని రేపల్లె రైల్వే స్టేషన్‌లో 25 ఏళ్ల గర్భిణిపై దాడి చేసి సామూహిక అత్యాచారం చేశారు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

అత్యాచారం చేసేందుకు రాలేదు… దొంగతనం కోసం వచ్చి ఆపైన అత్యాచారం చేశారు అని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మృగాళ్లకు సర్టిఫికేట్ ఇచ్చారు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

Also Read – కడప గడప నుంచే వైసీపి పతనం… కానీ క్రెడిట్ అందరిదీ!

అత్యాచారాలకు తల్లి పెంపకమే లోపం అని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి ప్రకటించారు. ఈ ప్రకటన మహిళా లోకాన్ని, మాతృమూర్తులను అవమానించడం కాదా? ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ

మే 2022లో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఇద్దరు పిల్లల తల్లి అయిన 26 ఏళ్ల యువతిపై లైంగిక దాడి జరిగింది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

2021లో మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల సంఖ్య 25% పైగా పెరిగిందని రాష్ట్ర పోలీసులు డిసెంబర్ 28, 2021న వెల్లడించారు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

2021 ఆగస్టులో గుంటూరులో 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థినిపై పట్టపగలు దుండగుడు దాడి చేసి కడుపుపై ఆరుసార్లు కత్తితో పొడిచాడు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

2021లో మహిళలపై నేరాలకు సంబంధించి 17736 కేసులు నమోదయ్యాయి. రిపోర్టు చేయని మరియు నమోదు కాని కేసులను కలుపుకొంటె సంఖ్య చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

మే 2022లో సీఎం సొంత జిల్లా కడప ప్రొద్దుటూరులో దళిత మైనర్ బాలికపై సుమారు ఏడాది పాటు అత్యాచారం జరిగింది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

జూన్ 2021లో సీఎం నివసిస్తున్న తాడేపల్లి దెగ్గరలో మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు పాల్పడ్డవారిలో ఒక వ్యక్తి ఇప్పటికీ దొరకలేదు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

సుగాలి ప్రీతికి న్యాయం చేయలేరు. సీబీఐకి కేసు ఇస్తున్నామన్నారు. ఎంత వరకు వచ్చింది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

రెండు మూడు అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి, వాటికే గోల చేయాలా అంటూ ఎదురు ప్రశ్న వేస్తారు మరో మహిళా మంత్రి గారు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

ఎంపీ హోదాలో ఉంటూ అసభ్యకరమైన వీడియో కాల్‌లో దొరికిపోతే నైతిక బాధ్యత మర్చిపోయిన ఆ ఎంపీని వెనకేసుకొస్తుంది వైసీపీ ప్రభుత్వం. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

వైసీపీ పార్టీలో మహిళలతో అసభ్యకరంగా మాట్లాడితే మంత్రి పదవి ఇస్తారు. ఇంకేం చేసుద్ది.. ఒక గంట వచ్చి వెళ్లిపో లాంటి మాటలతో మహిళలను లొంగదీసుకొనే పనులు చేస్తారు వైసీపీ ప్రజా ప్రతినిధులు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

సంవత్సరాలపాటు ప్రెస్ మీట్లు పెట్టి మహిళలను తక్కువ చేసి మాట్లాడతారు వైసీపీ లో మంత్రులు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

గుడివాడలో సంక్రాంతి సంబరాల పేరుతో చీర్ గాళ్స్ ను ఏర్పాటు చేసి రాష్ట్ర మంత్రి అండతో క్యాసినోలు నడిపారు. ఇక్కడ చీర్ గాళ్స్ ను భోగ వస్తువుగా చూపించలేదా? ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?

నీయమ్మ మొగుడు, లం*తనం, లం…కొడుకు లాంటి మాటలు యధేచ్చగా మాట్లాడతారు వైసీపీ ప్రజా ప్రతినిధులు, మంత్రులు. ఈ తిట్ల ద్వారా స్త్రీలను కించపరచడం లేదా? ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?