
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో కానూరు రోడ్‌లో ఓ సెలూన్ ప్రారంభోత్సవం చేశారు. తన వద్ద చాలా కాలంగా పనిచేసిన హెయిర్ స్టైలిస్ట్ సొంతంగా ‘సెలూన్ కొనికి’ పెట్టుకుంటూ ప్రారంభోత్సవం చేయాల్సిందిగా ఆహ్వానిస్తే పవన్ కళ్యాణ్ ఏమాత్రం సంకోచించకుండా ఈరోజు ఉదయం వచ్చి ప్రారంభోత్సవం చేశారు.
ఎప్పుడూ తెల్లటి దుస్తులలో కనిపించే పవన్ కళ్యాణ్ ఈరోజు టీషర్ట్ వేసుకొని రావడంతో మరింత ప్రత్యేకంగా కనిపించారు. పవన్ కళ్యాణ్ సెలూన్ ప్రారంభోత్సవానికి వస్తున్నారనే సంగతి తెలుసుకొని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిమంది అభిమానులు అక్కడకు తరలివచ్చారు.
Also Read – అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ సర్వం సిద్దం
పవన్ కళ్యాణ్ వారందరికీ అభివాదం చేస్తూ వెళ్ళి సెలూన్ ప్రారంభోత్సవం చేశారు. ఆయనతో పాటు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తదితరులు కూడా వచ్చారు.
ప్రారంభోత్సవం తర్వాత పవన్ కళ్యాణ్ సెలూన్ నిర్వాహకులు, వారి కుటుంబ సభ్యులతో సరదాగా కాసేపు మాట్లాడి వారితో సెల్ఫీలు దిగారు. తర్వాత అక్కడే ఉన్న అభిమానులతో కూడా సెల్ఫీలు దిగి అందరికీ మరోసారి అభివాదం చేసి తిరిగి వెళ్ళిపోయారు.
Also Read – వైసీపీలకి పవన్ వార్నింగ్… అబ్బే డోస్ సరిపోదు!
రాష్ట్రంలో ఎన్నో సమస్యలుండగా పవన్ కళ్యాణ్ ప్రజలను ఆకర్షించేందుకు ఈవిదంగా చవుకబారు ట్రిక్స్ ప్లే చేస్తుంటారని వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ విమర్శించగా, సాక్షి మీడియాలో “రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం, అక్రమ కేసులు, ఆమడ దూరంలో రాష్ట్రాభివృద్ధి, పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న పరిశ్రమలు, నిరుద్యోగ సమస్యలని నెటిజన్స్ ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ తీరుపై మండిపడుతున్నారని సొంత కవిత్వం జోడించింది.
జగన్ వాలంటీర్ల వ్యవస్థని సృష్టించుకున్నాక వైసీపీ కార్యకర్తలని చివరికి మంత్రులు, ఎమ్మెల్యేలని కూడా పట్టించుకోలేదు. వాలంటీర్లతోనే ప్రజలకు డబ్బు పంచిపెట్టి ఎన్నికలలో గెలిచేయవచ్చనుకున్నారు. కానీ ఓడిపోయాక వాలంటీర్లని నడిరోడ్డుపై వదిలేశారు. మూడుతరాలుగా వైఎస్ కుటుంబాన్ని అంటిపెట్టుకున్న విజయసాయి రెడ్డిని, మేకపాటి, ఆనం వంటివారిని జగన్ మెడ పట్టుకు గెంటేశారు కదా?చివరికి సొంత తల్లిని, చెల్లిని కూడా గెంటేశారు.
Also Read – షర్మిల ఫోన్ కేసీఆర్ ట్యాపింగ్ చేయిస్తే నాకేం సంబందం?
అంతటి వారినే పట్టించుకొనప్పుడు సామాన్య కార్యకర్తలని పట్టించుకుంటారా? అందుకే వారిని కాదని జగన్ తెనాలిలో రౌడీ షీటర్స్ ని పరామర్శించడానికి వెళ్ళారు.
కానీ పవన్ కళ్యాణ్ తన వద్ద పనిచేసిన ఓ హెయిర్ స్టైలిస్ట్ పిలిస్తే కాదనుకుండా వెళ్ళి ప్రారంభోత్సవం చేశారు.
ఇందుకు పవన్ కళ్యాణ్‌ని అభినందించకపోయినా పరవాలేదు. కానీ సమయం, సందర్భం లేకుండా నెటిజన్స్ పేరుతో సాక్షిలో ఈవిదంగా పవన్ కళ్యాణ్‌ని విమర్శించడం చాలా దుర్మార్గమే కదా?