జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు కొంతమంది టీవీ మీడియా అధినేతలతో మాట్లాడారు. ఈ సంధర్భంగా టీడీపీ, వైకాపాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 14న సభలో జనసేన భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తామని తెలిపారు. 2019 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో ఎన్ని స్థానాల్లో పోటీ చేసేది ప్రకటిస్తామన్నారు.
అయితే ఢిల్లీ వెళ్లి పోరాటం చేస్తారా అన్నదానికి ఆయన చిత్రమైన సమాధానం చెప్పారు. పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం లేనప్పుడు ఢిల్లీ వెళ్లి పోరాడితే న్యాయం జరుగుతోందన్న నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. ఈ నెల 14న జనసేన ప్లీనరీ గుంటూరులో జరుపుకోనున్న సంగతి తెలిసిందే. ఆ రోజుకు జనసేన స్థాపించి నాలుగు సంవత్సరాలు అవుతుంది.
గుంటూరు నాగార్జున యూనివర్సిటీ మైదానంలో పార్టీ సభ జరగబోతుంది. ఇప్పటికే వివిధ జిల్లాల నుండి కార్యకర్తలను సమీకరించే పనిలో ఉన్నారు స్థానిక నాయకులు. టీడీపీ, బీజేపీ రెండు పార్టీలు తనని వాడుకుని వదిలేశారు అని పవన్ కళ్యాణ్ చెప్పడంతో 2019లో ఒంటరిగా వెళ్ళబోతున్నారా అనేది చూడాలి.



