విశాఖలో ఈ రచ్చ… వైసీపీ వ్యూహం ఏమిటో?

Pawan_Kalyan_Vizagఎప్పుడూ ప్రశాంతంగా ఉండే విశాఖపట్నంలో గత రెండు మూడు రోజులుగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విశాఖను రాజధాని చేయాలని కోరుతూ నాన్-పొలిటికల్ జేయేసి ముసుగులో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు విశాఖ గర్జన నిర్వహించడంతోనే నగరంలో ఉద్రిక్తతలు మొదలయ్యాయని అందరికీ తెలుసు. అసలు అధికారంలో ఉన్న వైసీపీ రాజధాని కోసం విశాఖ గర్జన నిర్వహించడం దేనికి? రాజధాని ఏర్పాటు చేసుకొనే శక్తి, అధికారం దాని చేతిలోనే ఉంది కదా?కానీ ఏర్పాటు చేయకుండా ఉద్యమాలు చేస్తూ విశాఖలో అలజడి ఎందుకు సృష్టిస్తోంది?అనే ప్రశ్నకు వైసీపీ సమాధానం చెప్పదు. కానీ టిడిపి, జనసేనలు విశాఖలో అల్లర్లు సృష్టించి విశాఖ రాజధాని కాకుండా అడ్డుకొనేందుకు కుట్రలు పన్నుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మొన్న విశాఖ విమానాశ్రయం వద్ద జనసేన కార్యకర్తలు తమ మంత్రుల కార్లపై దాడి చేయడాన్ని సాకుగా చూపుతూ, పోలీసుల చేత వారిని అరెస్ట్ చేయించి హత్యా నేరం వంటి తీవ్రమైన సెక్షన్స్ కింద కేసులు నమోదు చేయించడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయితే వైసీపీ నేతలు తమ అభిమాన హీరో, పార్టీ అధినేతను నోటికి వచ్చినట్లు అనుచితంగా మాట్లాడటం వలననే, జనసేన కార్యకర్తలు తమ ఆగ్రహం ఆవిదంగా వ్యక్తం చేశారని అందరికీ తెలుసు. దానినే విశాఖలో జనసేన అల్లర్లు సృష్టించడంగా వైసీపీ నేతలు అభివర్ణిస్తున్నారు.

ADVERTISEMENT

అంతకు ముందు రోజు అంటే శనివారం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలు, జనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అప్పుడు పోలీసులు వారి ర్యాలీకి ఎటువంటి అభ్యంతరం చెప్పకపోగా వారి కోసం ట్రాఫిక్ ఆంక్షలు విధించి వాహనాలను మళ్లించి సహకరించారు కూడా.

కానీ ప్రతిపక్ష పార్టీ నేత పవన్‌ కళ్యాణ్‌ విశాఖలో జనవాణి సమావేశం నిర్వహించుకోవడానికి అభ్యంతరం తెలపడం ఆశ్చర్యకరం. విశాఖ విమానాశ్రయం వద్ద జరిగిన గొడవకు పవన్‌ కళ్యాణ్‌ కారణమంటూ నిందించడం, ఆయనను విశాఖ వదిలి వెళ్లిపోవాలని పోలీసులు హుకుంజారీ చేయడం చూస్తుంటే, ఈ సాకుతో టిడిపి, జనసేనల అధినేతలు విశాఖ, ఉత్తరాంద్ర జిల్లాలలో అడుగుపెట్టకుండా అడ్డుకొంటూ, వారు సభలు, సమావేశాలు నిర్వహించుకోనీయకుండా, ప్రజలను వారు కలవనీయకుండా చేయాలనే వైసీపీ దురాలోచన స్పష్టంగా కనబడుతోంది. టిడిపి, జనసేనలను ఉత్తరాంద్ర జిల్లాలలో నిషేధం విధించాలని వైసీపీ నేతలు చెప్పడమే ఇందుకు నిదర్శనం. తద్వారా ఉత్తరాంద్ర ప్రజలను రౌండప్ చేసి గంపగుత్తగా వారిచేత తమ పార్టీకే ఓట్లు వేయించుకోవాలనే దురాలోచన కనబడుతోంది.

విశాఖ ఘటనలపై పవన్‌ కళ్యాణ్‌ స్పందిస్తూ, “నేర చరిత్ర ఉన్నవారిని ఎన్నుకొంటే దౌర్జన్యాలు తప్ప ప్రజాస్వామ్యాన్ని నమ్మరానడానికి, రాజకీయాలు నేరమయం చేస్తారని చెప్పడానికి వైసీపీ పాలనే ఓ ప్రత్యక్ష ఉదాహరణ. నేను జనం తరపున పోరాడేందుకు విశాఖకు వస్తే ప్రజలను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించడానికే వచ్చానని నేనే వారిని అందుకు ప్రేరేపించానని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు పధకాలు, రాయితీలు ఇస్తూ అభివృద్ధి గురించి ప్రశ్నించకుండా చేయాలని ప్రయత్నిస్తోంది. అయితే ప్రజలు అంత అమాయకులు కారు. ఆ విషయం వచ్చే ఎన్నికలలో వారికే తెలుస్తుంది,” అని అన్నారు.

Watch and Subscribe for Exclusive Industry Interviews:

ADVERTISEMENT
Latest Stories