వైసీపిని ఎవరో ఓడించక్కరలేదు… దాని అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఓడించుకొంటారని గిట్టనివారు చెవులు కొరుకుంటున్నారు. ఇతర పార్టీలలో, ఇతరుల కుటుంబాలలో చిచ్చు పెట్టబోయి సొంత పార్టీ, సొంత ఇంట్లోనే జగన్ చిచ్చుపెట్టుకొంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్‌కు ఓటమి కళ్లెదుటే కనిపిస్తుండటంతో ఇప్పుడు కాపు కులంలో చిచ్చుపెట్టి కాపు సామాజిక వర్గాన్ని నిలువునా చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ ఓ పెద్ద లేఖని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టుకొని, రాష్ట్రాభివృద్ధిలో కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని, నేను కోరుకొంటున్నానని పవన్ కళ్యాణ్ లేఖలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను జాగ్రత్తగా అడుగులు వేస్తూ, ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని ప్రయత్నిస్తుంటే, కాపు పెద్దల ద్వారా ఓట్లు చీల్చేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వారి చేతే నన్ను దూషింపజేస్తున్నప్పటికీ వాటిని తాను ఆశీర్వాదాలుగానే భావిస్థానాని, వారి కోసం కూడా జనసేన పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని పవన్ కళ్యాణ్ లేఖలో పేర్కొన్నారు. కనుక రాష్ట్రంలో కాపులు వైసీపి మాయలో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.
అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ హితోక్తులు వారి చెవికి ఎక్కుతాయా?ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ఉడతా భక్తిగా పవన్ కళ్యాణ్‌కు తోడ్పడతారా లేక జగన్మాయలో చిక్కుకొని వైసీపి అధికారంలోకి వచ్చేందుకు తోడ్పడుతారా? అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
పవన్ హితవు పెద్దల చెవికెక్కుతుందా?

వైసీపీకి ఓటమి కళ్లెదుట కనిపిస్తోంది…
అందుకే కొందరు కాపు పెద్దలను రెచ్చగొడుతోంది• నేను గౌరవించే కాపు పెద్దలు నన్ను దూషించినా దీవెనలుగానే స్వీకరిస్తాను
• నన్నెంతగా దూషించినా వారికి జనసేన వాకిలి తెరిచే ఉంటుంది
• కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని కరాఖండీగా చెప్పి…… pic.twitter.com/wCWL3iKH0K
— JanaSena Party (@JanaSenaParty) January 4, 2024