సత్యవేడు మండలం మాదన్నపాలెంలో హీరో మోటర్స్ పరిశ్రమకు సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. వాస్తవానికి రాష్ట్ర విభజన జరిగిన కొద్దినెలల్లోనే హీరో సంస్థను రాష్ట్రానికి రప్పించడంలో ప్రభుత్వం విజయం సాధించింది. ఈ కార్యక్రమానికి హీరో మోటర్స్ చైర్మన్ పవన్ ముంజాల్, మంత్రి అమరనాథ్ రెడ్డి హాజరైనారు.
ఈ సంధర్భంగా పవన్ ముంజాల్ మాట్లాడుతూ చంద్రబాబు ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావడానికి తమను ఎలా కన్విన్స్ చేసారో వివరించారు. “మేము వేరే రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు పెట్టడానికి డిసైడ్ అయిపోయాం. అయితే ఒక రోజు ఆయన మా ఇంటికి భోజనానికి వచ్చారు. ఒక గంట నాతో మాట్లాడి నా అభిప్రాయం మార్చుకునేలా చేశారు. ఇది చంద్రబాబు వల్లే సాధ్యం,” అని ఆయన అన్నారు.
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పవన్ ముంజాల్ చంద్రబాబుని తన ఇంటికి భోజనానికి రమ్మని పిలవలేదట. నేను వస్తున్న తెల్సిన వారితో కబురుపంపి మరి వెళ్లారట. అది రాష్ట్రం పట్ల చంద్రబాబు కమిట్మెంట్. సత్యవేడు మండలం మాదన్నపాలెం గ్రామంలో 600 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఈ సంస్థ రూ.1,600కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది.
అదనంగా మరో రూ.1,600కోట్లను సంస్థకు అనుబంధ పరికరాల తయారీ యూనిట్లపై పెట్టుబడి పెడుతుంది. దీనిద్వారా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ దాదాపు 15,000మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కియా మోటార్స్, హీరో మోటోకార్ప్ ఇప్పటిదాకా చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి వచ్చిన అతిపెద్ద పెట్టుబడులు. రెండు రాయలసీమలోనే పెట్టించారు.
Some People Talk , Some People Work.
Chandra Babu @ncbn always WORK for the Development of state , always think about how to create employment for the Youth !
This is One of the Example said by HERO Chairman #AndhraPradeshDevelopment #HeroMotorsinAP
Stand up & Salute 🙏🏻 pic.twitter.com/1v7b6P4fMs
— Telugu Desam Party (@TeluguDesam_) March 23, 2018



