సంఘ విద్రోహులను వదిలేసి టిడిపిపై నిఘా… సిగ్గుచేటు!

payyavula-keshavజగన్ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తూ టిడిపిపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో సంఘ విద్రోహక శక్తులపై నిఘా పెట్టి శాంతి భద్రతలు కాపాడాల్సిన జగన్ ప్రభుత్వం, ప్రతిపక్ష టిడిపి నేతలపై నిఘా పెడుతుండటం చాలా దారుణం. తమ సొంతపార్టీ నేతాళ్ళు, మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరికి సాక్షి మీడియా ఉద్యోగులపై కూడా నిఘా పెడుతుండటం ఇంకా దారుణం. తమని నమ్మని జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొన్నారు వైసీపీ నేతలందరూ!

ADVERTISEMENT

జగన్మోహన్ రెడ్డి ఎల్లప్పుడూ అధికారం కోల్పోతానేమోననే తీవ్ర అభద్రతాభావంతో ఉంటారు. అందుకే దానిని కప్పిపుచ్చుకొనేందుకు ఇటువంటి విషప్రయత్నాలు చేస్తుంటారు. మా ప్రభుత్వ హయాంలో ఏవో జరగరాని అనర్ధాలు జరిగిపోయాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగానే పెగాసెస్ కూడా.

మాపై బురదజల్లి రాజకీయంగా దెబ్బ తీయాలనే ఉద్దేశ్యంతోనే పెగాసెస్‌పై విచారణ కోసం కమిటీ వేశారు తప్ప దానితో ఏమైనా నిరూపించగలరా?ఎవరు ఎవరిపై నిఘా పెడుతున్నారో సిబిఐ చేత దర్యాప్తుకి మీరు సిద్దమేనా?మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆరోపణలు చేయిస్తూ మాపై బురద జల్లాలని ప్రయత్నించే బదులు, రాతపూర్వకంగా మీ కమిటీ కనుగొన్న వివరాలను, సాక్ష్యాధారాలతో ఇవ్వగలరా?” అంటూ పయ్యావుల కేశవ్ జగన్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యం అనే ఓ దళిత యువకుడిని అతికిరాతకంగా హత్య చేసి అతని శవాన్ని కారులో తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించిన తరువాత కూడా పోలీసులు అతనిని అరెస్ట్ చేయడానికి సుమారు వారం రోజుల సమయం పట్టింది. కనుకనే నిఘా పెట్టవలసిన వాళ్లపై పెడితే మంచిదని పయ్యావుల కేశవ్ సూచిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories