సుక్కూ ఎందుకు స్పందించలేదు?

Sukumar remains silent amid Peddi movie controversy and industry reactions after release.

“పెద్ది” సినిమా విషయంలో ఇంకా డిస్కషన్ నడుస్తూనే ఉంది. ఆల్రెడీ నిన్నటి నుండి ఛాంబర్ లో పర్సంటేజ్ విషయంలో జరుగుతున్న రచ్చ చూస్తూనే ఉన్నాం. ఫిలిం ఛాంబర్ అంగీకరించిన 7.5 పర్సంటేజ్ నాకు తెలియని నిర్మాత చెప్పడం, ఇప్పుడు పర్సంటేజ్ ఇచ్చే పరిస్థితిలో లేను అని సతీష్ కిలారు చేతులెత్తేశారు.

అయితే.. ఇంతకంటే పెద్ద డిస్కషన్ “పెద్ది” ఆఫీస్ లో నడుస్తోంది. అదేంటంటే.. ఇప్పటివరకు సుకుమార్ ఈ సినిమా విషయంలో ఎందుకు స్పందించలేదు అని. స్వయంగా తన శిష్యుడు తెరకెక్కించిన ఈ సినిమాని సుకుమార్ తన స్వంత బ్యానర్ “సుకుమార్ రైటింగ్స్”లో సమర్పించారు కూడా. రిలీజ్ కి ముందు ప్రెస్ మీట్ లో ఏకంగా “రంగస్థలం” సినిమాని దాటేస్తుందని ప్రకటించిన చిత్రబృందంలో సుకుమార్ ప్రథముడు. బుచ్చిని ఆకాశానికి ఎత్తేశాడు.

ADVERTISEMENT

ఆ తర్వాత మాత్రం సుకుమార్ ఏ ఈవెంట్లోనూ కనిపించలేదు. ఇక సినిమా రిలీజ్ తర్వాత కనీసం మచ్చుకకైనా ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టలేదు. దాంతో.. అవుట్ పుట్ విషయంలో గురుశిష్యుల నడుమ విబేధాలు తలెత్తిన విషయం వాస్తవమే అని స్పష్టమైంది. సుకుమార్ మాత్రమే కాదు.. అల్లు అర్జున్ పొగుడుతూ ఒక పోస్ట్ పెట్టేవరకు ఇండస్ట్రీ నుండి ఒక్కటంటే ఒక్క సపోర్టింగ్ ట్వీట్/పోస్ట్ పడలేదు పెద్ది విషయంలో. అల్లు అర్జున్ తర్వాత మాత్రం అడివి శేష్, తేజ సజ్జా వంటి హీరోలు ముందుకొచ్చారు.

ఓ పక్క టీమ్ మెంబర్స్ ఏమో 400 కోట్ల పోస్టర్ రిలీజ్ చేయడానికి సన్నద్ధమవుతుండగా.. ఇలా ఇండస్ట్రీ నుండి కనీస స్థాయి సపోర్ట్ లభించకపోవడం అనేది గమనార్హం. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ కూడా గుర్రుగా ఉన్నారు. చరణ్ కి క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకునే రానా కూడా “పెద్ది” విషయంలో సైలెంట్ గా ఉన్నాడు. గతవారం విడుదలైన “సింగ్ గీతం” విషయంలో మాత్రం ఇండస్ట్రీ మొత్తం పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యింది.

ADVERTISEMENT
Latest Stories