శాసనసభకు వచ్చేదేలే… కానీ పదవులు ఇవ్వాల్సిందే

peddireddy-ramachandra-reddy

వైసీపి అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్‌ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలకు హాజరుకారు. కానీ జగన్మోహన్‌ రెడ్డికి ప్రధాన ప్రతిపక్షనాయకుడు హోదా ఇవ్వాలని వితండవాదం చేస్తుంటారు.

ఇప్పుడు ఆ ఆనవాయితీ ప్రకారమే ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌ పదవి తమకే ఇవ్వాలని వైసీపి పట్టుబట్టపోతోంది.

ADVERTISEMENT

ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు నామినేషన్ గడువు ముగుస్తుండటంతో వైసీపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నామినేషన్ వేసేందుకు శాసనసభకు చేరుకున్నారు.

అయితే పీఏసీలో 9 మంది శాసనసభ్యులు, ముగ్గురు ఎమ్మెల్సీలు కలిపి మొత్తం 12 మంది సభ్యులు ఉంటారు. సాధారణంగా ప్రతిపక్ష సభ్యుడు ఉంటే అతను లేదా ఆమెకు పీఏసీ ఛైర్మన్‌ పదవికి ఇవ్వడం ఆనవాయితీ.

కానీ పీఏసీ సభ్యుడుగా నామినేట్ అవ్వాలంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కానీ వైసీపికి జగన్‌తో కలిసి కేవలం 11 మందే ఉన్నారు. కనుక కనీసం సభ్యత్వం కూడా పొందలేరు. కానీ పీఏసీ ఛైర్మన్‌ పదవి ఆశిస్తూ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చేత నామినేషన్ వేయిస్తుండటం విశేషం.

తమకు సరిపడా ఎమ్మెల్యేలు లేరని తెలిసి ఉన్నప్పటికీ నామినేషన్ వేయిస్తుండటం రాజకీయం కోసమే అని అర్దమవుతూనే ఉంది.

పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి 18 మంది ఎమ్మెల్యేల మద్దతు లేదు కనుక స్పీకర్‌ ఆయన నామినేషన్ తిరస్కరిస్తే, “శాసనసభలో ప్రతిపక్షానికి విలువలేదు. ప్రతిపక్షం గొంతు వినపడకుండా చేస్తున్నారు. ప్రజాస్వామ్యం ఖానీ అయిపోతోంది,” అని గొంతు చించుకొని జగన్‌ తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని ట్వీట్స్ వేయడం మొదలుపెడతారు. కానీ నిబందనల ప్రకారం 18 మంది ఎమ్మెల్యేల మద్దతు లేకుండా పీఏసీ కమిటీకి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చేత నామినేషన్ వేయిస్తూ వైసీపియే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది కదా?

మరికొద్ది సేపటిలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు పీఏసీ కమిటీ సభ్యులు, ఛైర్మన్‌ పేర్లను ప్రకటించనున్నారు. ఆ తర్వాత వైసీపి డ్రామా మొదలవుతుంది.

ADVERTISEMENT
Latest Stories