ఏపీపై కేంద్రం దృష్టి పెడితే వైసీపీ ఇంత బరి తెగించేదా?విష్ణుకుమార్ రాజు

Penmetsa Vishnu Kumar Raju Responds on Ayyanna Patrudu Arrestఏపీ బిజెపి నేతలలో ఏ విషయంపైనైనా ధైర్యంగా మాట్లాడగలిగే నాయకుడు విష్ణుకుమార్ రాజు. ఈరోజు ఆయన బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “టిడిపి నేత అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన ఏమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదా?అర్దరాత్రి 200 మంది పోలీసులు ఆయన ఇంటి గోడదూకి తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించి అరెస్ట్ చేయడం ఏమిటి? ఆయన వైసీపీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నారనే కక్షతోనే ఈవిదంగా వేధిస్తున్నారు. మరీ ఇంత శాడిశామా? అయినా ఏదైనా తప్పు జరిగినట్లు ఓ ఇంజనీరు గుర్తిస్తే తనపై అధికారికి ఫిర్యాదు చేయాలి లేదా పోలీసులకి ఫిర్యాదు చేయాలి కానీ నేరుగా సిబి సిఐడీకి ఎలా ఫిర్యాదు చేస్తాడు? చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా జరిగినట్లు చూశామా? ఆయన ఎవరో ఫిర్యాదు చేయడం వెంటనే అర్దరాత్రి సిఐడీ పోలీసులు గోడదూకి ఆయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేయడం ఏమిటి? మీరు మనుషులేనా? అన్నం తింటున్నారా లేక గడ్డి తింటున్నారా?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచకాలపై ఢిల్లీలో ఉన్న మా పార్టీ పెద్దలు వెంటనే దృష్టి సారించాలి. మేము ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్నవన్నీ మా అధిష్టానం దృష్టికి తీసుకువెళుతున్నాము. కానీ ఇకనైనా మా ఢిల్లీ పెద్దలు దృష్టి సారించకపోతే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది.

ADVERTISEMENT

సిఎం జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న (వైఎస్ వివేకానంద రెడ్డి) హత్యకు గురైతే పట్టించుకోరు కానీ ఎక్కడో నర్సీపట్నంలో ఓ రెండు సెంట్లు భూమిలో తేడా వచ్చిందంటూ ఏకంగా 200 మంది పోలీసులను దండయాత్రగా అయ్యన్న పాత్రుడు ఇంటికిపై పంపించి అర్దరాత్రి అని కూడా చూడకుండా అరెస్ట్ చేశారు. మీ వైసీపీ నేతలే విశాఖపట్నంలో వందల కొద్ది ఎకరాలను కబ్జాలు చేస్తుంటే పట్టించుకోరు. ఋషికొండను తవ్వేస్తున్నా పట్టించుకోరు. పైగా అనుమతించినదాని కంటే కాస్త ఎక్కువే తవ్వేసుకొన్నామని నిర్లజ్జగా కోర్టుకే చెప్పుకొంటారు. మీకు కోర్టులంటే లెక్కలేదు. ఎంతసేపు లంచం లంచం తప్ప మరొకటి అవసరం లేదు మీకు. 2024 ఎన్నికలలో మీ వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయం,” అని నిప్పులు చెరిగారు.

విష్ణుకుమార్ రాజు తమ అధిష్టానంపై అసహనం ప్రదర్శించడాన్ని తప్పు పట్టలేము. ఆయన ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మనసులో ఏమనుకొంటున్నారో అదే చెప్పారు. వైసీపీ అరచాకాలను చూస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోందనే భావన, ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏమైపోతుందనే ఆవేదన ఆయన మాటల్లో చాలా స్పష్టంగా వినబడింది.

ఈ నెల 11,12 తేదీలలో ప్రధాని నరేంద్రమోడీ విశాఖ పర్యటనకు వస్తున్నారు. అయితే రాష్ట్ర బిజెపి నేతల పిర్యాదులు ఆయన చెవిన పడకుండా చేసి ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టేశారు. మరి విష్ణుకుమార్ రాజు చెపుతున్న ఈ మాటలు ఢిల్లీ పెద్దల చెవిలో పడతాయో లేక కంఠశోషే అవుతుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories