
శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర పేరుతో విశాఖ బీచ్ రోడ్‌లో 3 లక్షలకుకు పైగా నిర్వహించిన యోగాసనాలకు గిన్నీస్ రికార్డులో స్థానం లభించింది. ఇంత మందితో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ప్రధాని మోడీ అప్పుడే సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌లను ముఖ్యంగా మంత్రి నారా లోకేష్‌ని ప్రత్యేకంగా అభినందించారు.
ఇటువంటి పెద్ద కార్యక్రమాలను ఏవిదంగా నిర్వహించాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలని ప్రధాని మోడీ అన్నారు.
Also Read – జగన్-చంద్రబాబు పర్యటనలలో ఎంత తేడా!
దేశంలో బీజేపి పాలిత రాష్ట్రాలలో కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమాలు జరిగాయి. కానీ ప్రధాని మోడీ ఏపీలో విశాఖ సముద్ర తీరంలో జరిగిన ఈ కార్యక్రమం పట్ల అత్యంత సంతృప్తి వ్యక్తం చేస్తూ నేడు ఎక్స్ సోషల్ మీడియాలో ఏపీ ప్రభుత్వాన్ని, ప్రజలను అభినందిస్తూ సందేశం పెట్టారు.
యోగా, ఆరోగ్యం, టెక్నాలజీ, అభివృద్ధి విషయంలో ప్రధాని మోడీ, సిఎం చంద్రబాబు నాయుడు ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. కనుక అంతర్జాతీయ యోగా దినోత్సవంతో సహా కేంద్ర ప్రభుత్వ నిధులు లేదా వాటాతో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పధకాలు, స్వచ్చ భారత్, వికసిత్ భారత్ వంటి అనేకం చేపట్టి అమలుచేస్తున్నారు.
బీజేపి పాలిత రాష్ట్రాలలో కూడా ఈ కార్యక్రమాలు ఇంత నిబద్దతతో ఇంత వేగంగా జరగడం లేదనేది వాస్తవం. మరోపక్క కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, బీజేపిని వ్యతిరేకించే మమతా బెనర్జీ వంటి ముఖ్యమంత్రులున్న రాష్ట్రాలు రాజకీయ లెక్కలు, కారణాల వలన కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలకు, పధకాలను పట్టించుకోవడం లేదు. ఒకవేళ అమలుచేస్తున్నా వాటిని తమ పార్టీ, తమ ప్రభుత్వానికి ఆపాదించుకొని క్రెడిట్ తీసుకుంటున్నాయి.
ఉదాహరణకు ఇదివరకు కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వ పనులను, పధకాలను రాజకీయ కారణాలతో కేంద్ర ప్రభుత్వ పద్ధకాలను తిరస్కరించేవారు.
Also Read – మళ్ళీ యశోదలో కేసీఆర్.. వాట్ నెక్స్ట్?
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో రైల్, రోడ్ తదితర ప్రాజెక్టులు జరుగుతున్నప్పటికీ తెలంగాణపట్ల కేంద్రం వివక్ష చూపుతోందని కేసీఆర్ విమర్శించేవారు.
అదే సమయంలో తమ మంత్రులు చొరవ తీసుకొని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రాజెక్టులు సాధించుకున్నారని, వాటిని తమ ప్రభుత్వం శరవేగంగా నిర్మిస్తోందని క్రెడిట్ తీసుకుంటూ ఉండేవారు.
కానీ సిఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, పధకాల గురించి మాట్లాడినప్పుడు, ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోనే ఇవన్నీ సాధ్యపడుతున్నాయని చెపుతూ, వాటి పూర్తి క్రెడిట్ ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికే ఇస్తున్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవంకి సకల ఏర్పాట్లు ఏపీ ప్రభుత్వమే చేసినప్పటికీ, ప్రధాని మోడీ సూచన మేరకే విశాఖ తీరంలో ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం రూ.75 కోట్లు నిధులు అందించిందని నిన్న ప్రెస్‌మీట్‌లోనే తెలుగు, ఇంగ్లీషు భాషల్లో చెప్పారు.
సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఈ మాటలన్నీ జాతీయ మీడియా ద్వారా ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోడీ కూడా విన్నారు. కనుక ఆయన మరింత సంతోషంతో అభినందనలు తెలుపుతూ వెంటనే మెసేజ్ పెట్టారు.
కేంద్రంకి దక్కాల్సిన క్రెడిట్ తీసుకొని బిఆర్ఎస్ పార్టీ ఏం లబ్ధి పొందిందో కానీ, తీసుకోకుండా దానిని కేంద్రానికే కట్టబెడుతూ సిఎం చంద్రబాబు నాయుడు ఏపీకి చాలా లబ్ధి చేస్తున్నారు.