Modi Congratulates Nara Lokesh

నేడు అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం బీచ్ రోడ్‌లో జరిగిన యోగాసనాల కార్యక్రమం విజయవంతం అవడంతో, ప్రధాని మోడీ సిఎం చంద్రబాబు నాయుడుని, మంత్రి నారా లోకేష్‌ని ప్రత్యేకంగా అభినందించారు.

“ఈ కార్యక్రమం కోసం వారిరువురూ దాదాపు 45 రోజులుగా పనిచేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్‌ చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ని లక్షల మంది పాల్గొనేలా చేయడం, ఇంత మందికి సకల ఏర్పాట్లు చేయడం మామూలు విషయం కాదు.

Also Read – ఇండోసోల్ నిర్వాసితులను జగనే కాపాడాలట!

అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా నేడు జరుగుతున్న ఈ కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజలందరిని కలిపారు. ఇందుకు వారిరువురికీ ముఖ్యంగా మంత్రి నారా లోకేష్‌కి ప్రత్యేక అభినందనలు,” అంటూ ప్రధాని మోడీ ప్రశంశించారు.




ప్రధాని మోడీ కూడా గుర్తించి ప్రశంసించేలా ఏర్పాట్లు చేసి మంత్రి నారా లోకేష్‌ తన సమర్దత నిరూపించుకున్నారు. ఇది నారా లోకేష్‌ రాజకీయ ఎదుగుదలకి ఎంతగానో తోడ్పడవచ్చు.

Also Read – గులక రాయి తగలడం వల్లనే జగన్‌కి మతిమరుపు?