
అదేదో సినిమాలో “బాస్ వస్తున్నాడు.. అయితే షర్ట్ ఏస్కో.. ప్యాంట్ ఏస్కో..” అంటూ ఓ పాట వినే ఉంటారు. అలాగే వైసీపీ అధినేత జగన్ ప్యాలస్ బయటకు వస్తున్నాడంటే, ‘రాళ్ళు, కర్రలు రెడీ చేస్కో.. రప్పారప్పా ఫ్లెక్సీలు రెడీ చేస్కో..’ అని అనుకోవలసిన పరిస్థితి కనిపిస్తోంది.
రెంటపాళ్ళ పర్యటనలో సింగయ్య మృతి కేసులో మొదట తనకేమీ సంబందం లేదన్నట్లు వాదించిన జగన్, ఆయన కుటుంబానికి రూ.10 లక్షలు నష్ట పరిహారం ఇచ్చానని చెప్పుకోవడంతో తన వల్లే ఆయన చనిపోయారని జగన్ ఒప్పుకున్నట్లయింది.
Also Read – వైసీపీ లో ఆషాడం ఆఫర్..?
కనుక కోడికత్తి, పాస్‌పోర్టు కోసం కోర్టుకి వెళ్ళడానికి నామోషీగా భావించిన జగన్‌కి ఇప్పుడు సింగయ్య మృతి కేసులో విచారణకి పిలిస్తే పోలీస్ స్టేషన్‌కి హాజరవడం చాలా నామోషీగానే ఉంటుంది. అందుకే పరుగున వెళ్ళి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారనుకోవచ్చు.
కానీ ఆయన అదృష్టం ఏమిటంటే, విచారణకు పిలిచేందుకు పోలీసులు ఇంకా మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. దురదృష్టం ఏమిటంటే, ఆ కేసుని కొట్టేయాలని జగన్ & కో నిన్న క్వాష్ పిటిషన్ వేస్తే, ఈరోజు కూడా హైకోర్టు దానిని విచారణకు స్వీకరించలేదు! రేపైనా విచారణకు స్వీకరిస్తుందో లేదో తెలీదు.
Also Read – జగన్ ఆలోచింపజేయగలుగుతున్నారు మరి కూటమి నేతలు?
కనుక ఈలోగా పోలీస్ స్టేషన్‌కు పిలిస్తే?ముందే చెప్పుకున్నట్లు“బాస్ వస్తున్నాడు.. అయితే షర్ట్ ఏస్కో.. ప్యాంట్ ఏస్కో..” అంటూ అందరూ సిద్దమవుతారు. వేలాదిమందిని వెంటబెట్టుకొని పోలీస్ స్టేషన్ వెళ్ళి అక్కడ ఉద్రిక్త వాతావరణం సృష్టించి, ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రజాస్వామ్యం గొంతు నులిమేస్తున్నారంటూ వైసీపీ నేతల చేత, సొంత మీడియా చేత చెప్పించుకునే వెసులుబాటు ఎలాగూ ఉందనే ఉంది.
కానీ పార్టీ నేతలని “కేసులు పెట్టించుకోండి.. జైళ్ళకు వెళ్ళండి,” అని నూరిపోసిన జగన్, ఇంకా నోటీస్ రాక ముందే కోర్టుకి ఎందుకు పరిగెత్తారు? అంటే పార్టీ నేతలకి, కార్యకర్తలకి చెప్పిన మాటలు ఆయనకి వర్తించావా?అనే సందేహం కలుగుతుంది.
Also Read – గులక రాయి తగలడం వల్లనే జగన్‌కి మతిమరుపు?
తనని ప్రజల మద్యకు రాకుండా అడ్డుకునేందుకే కూటమి ప్రభుత్వం ఇటువంటి కుట్రలు చేస్తోందని జగన్ ఆరోపిస్తున్నారు. దానినే మరోలా చెప్పుకుంటే ఇలా ఏదో ఓ కేసులో అరెస్ట్ చేస్తారనే భయంతోనే బయటకు రావడం లేదనుకోవచ్చు. ఇందుకు హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషనే సాక్ష్యం!