మోడీకి మాత్రమే ఆ రూలా? చంద్రబాబును తూలనాడేటప్పుడు వర్తించదా?

NArendra Modi - Chandrababu Naidu-ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సి నరసింహారావు ఒక టీవీ ఛానల్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిత్వంపై, ఆయన మానసిక స్థితిపై చేసిన విశ్లేషణ రాష్ట్ర బీజేపీ నేతలకు కంటగింపుగా మారింది. పనిలో పనిగా మోడీ కులం కార్డు అడ్డుపెట్టుకుని నరసింహారావు ని నిందిస్తున్నారు ఆ పార్టీ నేతలు.

ADVERTISEMENT

బడుగువర్గానికి మోదీపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దేశంలో అగ్రవర్ణాలకే అధికారం ఉండాలా? అని ఏపీ బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి ప్రశ్నించారు. నరసింహారావుది అహంకారపూరిత, అగ్రకుల వ్యాఖ్యానమని విమర్శించారు. అయితే మోడీని బడుగు వర్గం వాడని ప్రధానిని చెయ్యలేదని వారు గుర్తించాలి.

ఆయన అభివృద్ధి చేస్తారని ప్రజలు అవకాశం ఇచ్చారు. సాధారణ రాజకీయ నాయకులు లాగా కులం కార్డు ప్రయోగిస్తే మళ్ళీ మొదటికే మోసం రావొచ్చు. ఉన్నతమైన వ్యక్తుల గురించి రాసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదన్నారు. దేశంలో ఉన్నతస్థాయి వ్యక్తులు అంటే మోడీ అమిత్ షా మాత్రమేనా లేక ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాట్లాడేటప్పుడు బీజేపీ నాయకులకు వర్తించదా ఆ మాట?

ADVERTISEMENT
Latest Stories