న్యాయం జరుగదు కానీ న్యాయం ధర్మమే గెలుస్తుంటాయి

Political Investigation Cases Turn into Endless Dramas

కేసులు-విచారణలు రెండు రకాలు. మొదటిది అక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసు-విచారణలని అంతూపొంతూ లేకుండా నిందితులే సాగదీస్తుండటం.

రెండో రకంలో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్‌, ఎఫ్-1 రేసింగ్, కాళేశ్వరం, ఏపీలో మద్యం స్కామ్‌ వగైరా వస్తాయి. వీటిని ప్రభుత్వాలు లేదా పోలీసులే ఏళ్ళపాటు సాగదీస్తూ అవసర సమయంలో ముందుకీ వెనక్కీ జరుపుతుంటారు.

ADVERTISEMENT

మొదటి రకంలో నిందితులు ఎవరినీ నిందించరు. వీలైనంత నిశబ్దంగా ఉంటూ కేసు విచారణలను పుష్కరాలు దాటించేస్తుంటారు. అధికార పార్టీ నేతలు కూడా ఆ కేసులను పెద్దగా పట్టించుకోరు. అప్పుడప్పుడు నిద్రలో కలవరించినట్లు వాటి గురించి మొక్కుబడిగా రెండు ముక్కలు మాట్లాడుతుంటారు.

రెండో రకం కేసులో సాధారణంగా ప్రతిపక్షపార్టీ నేతలే బాధితులుగా ఉంటారు. కనుక వారిని నోటీస్ వచ్చినపుడల్లా ప్రభుత్వాలని నిందిస్తుంటారు. తాము ఆణిముత్యాలమని, చట్టాలు, న్యాయవ్యవస్థపై తమకు గౌరవం, నమ్మకం ఉన్నాయని, న్యాయం ధర్మం తప్పక గెలుస్తుందని వంటి కొటేషన్స్ చెపుతుంటారు.

అయితే ఈ రెండో రకంలో కేసులు ఇబ్బందికరంగా మారినప్పుడు సహనం కోల్పోయి “డైలీ సీరియల్లా ఏళ్ళ తరబడి విచారణ జరుపుతూనే ఉన్నారు. ఇంకా ఎంత కాలం ఈ లొట్టిపిట్ట కేసులు విచారిస్తారు?” అని ఎదురు ప్రశ్నిస్తుంటారు. ఫోన్ ట్యాపింగ్‌ కేసులో నేడు విచారణకు హాజరవుతున్న కేటీఆర్‌ కూడా ఇలాగే అసహనం వ్యక్తం చేశారు.

బిజేపి ఎంపీ బండి సంజయ్ కూడా ఈ కేసులు ‘ఎంత కాలం ఎంత కాలం…?’ అంటూ పాట పాడారు. వాళ్ళని అరెస్ట్ చేయడానికి మీకు ధైర్యం లేకపోతే సీబీఐకి అప్పగించేయండి. ‘మావాళ్ళే’ చూసుకుంటారని ఉచిత సలహా కూడా ఇస్తుంటారు.

ఆయన మాటలు నమ్మే సిఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ వ్రాస్తే పట్టించుకునే నాధుడు లేడు. ఇప్పుడీ దివ్యాస్త్రాన్ని కూడా సీబీఐకి అప్పగించాలని సిఎం రేవంత్ రెడ్డి అనుకోరు కదా?

ఇంతకీ ఈ కేసులు, విచారణలు నేరం చేసినవారిని కనిపెట్టడానికా లేదా రాజకీయ కాలక్షేపం కోసమేనా?అని పామర జనాలకు కూడా డౌట్ వచ్చేస్తోంది.

ADVERTISEMENT
Latest Stories