కర్మ ఫలం బిఆర్ఎస్ ను ’23’ గా వెంటాడబోతుందా?

BRS karma in politics

కర్మ ఫలం ఎంతటి వారినైనా వెంటాడుతుంది అనేది యదార్ధం అంటూ పురాణాల చరిత్ర చెపుతుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖ్య చిత్రాన్ని నిశితంగా గమనిస్తే అది వాస్తవ రూపంలో కంటికి కనిపిస్తుంది.

నాడు టీడీపీ ఓటమి కోసం చేతులు కలిపిన వైసీపీ, బిఆర్ఎస్ రెండు పార్టీలు అదే టీడీపీ దెబ్బకు అధికారానికి దూరమయ్యాయి. అయితే ఏపీలో ప్రత్యక్ష పోరుతో నెగ్గిన టీడీపీ తెలంగాణలో పరోక్ష మద్దతుతో బిఆర్ఎస్ ను మట్టి కరిపించింది.

ADVERTISEMENT

ఇలా ఈ రెండు పార్టీలు తమ అధికారానికి దూరమై 2019 ఎన్నికల తాలూకా కర్మఫలాన్ని అనుభవిస్తున్నాయి. అలాగే నాడు బాబుని రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించి, బాబు పై వారి కుటుంబ సభ్యుల పై నీచ విమర్శలు చేసిన వైసీపీ పైశాచిక ఆనందాన్ని అనుభవించింది.

ఇప్పుడు దాని ఫలితంగా అదే జైళ్ల చుట్టూ జగన్ నుంచి ఆయా పార్టీల ముఖ్య నేతల వరకు ఓదార్పు యాత్రలు, పరామర్శ పర్యటనలు సాగిస్తున్నారు. ఇక వైస్ జగన్ తన సొంత కుటుంబం సభ్యులైన తల్లి, చెల్లి నుంచి విమర్శలు ఎదుర్కొంటు కక్కలేక మింగలేక అల్లాడుతున్నారు.

ఇక బిఆర్ఎస్ విషయానికొస్తే నాడు టీడీపీ ఓటమితో బాబు ని నిస్సహాయుడిని చేసాము అనే ఆనందం వారికి ఐదేళ్ల తరువాత రేవంత్ రూపంలో తిరిగి రిటర్న్ గిఫ్ట్ గా వచ్చింది. 2019 ఎన్నికలలో టీడీపీ ఓటమికి కారణమైన కేసీఆర్ నేడు బిఆర్ఎస్ గెలుపు కోసం ఫామ్ హౌస్ గడప దాటలేని పరిస్థితులలో ఉన్నారు.

ఒకపక్క కవిత జాగృతి రచ్చతో, మరోపక్క కాళేశ్వరం రొచ్చులో, కేటీఆర్ ఫోన్ టాపింగ్ రగడతో బిఆర్ఎస్ లో ఎం జరుగుతుందో కూడా ఊహించలేని నిస్సహాయుడిగా నిలబడ్డారు కేసీఆర్. ఇక నాటి కేసీఆర్ మద్దతు వైసీపీ ని 151 తో ఆకాశంలో కూర్చోబెడితే, 23 తో టీడీపీని నేలకూల్చింది.

అయితే ఇప్పుడు అదే టీడీపీ వైసీపీ ని 11 తో పాతాళానికి తొక్కితే, బిఆర్ఎస్ ను అదే 23 కి తీసుకురాబోతుంది. 2023 ఎన్నికలలో 39 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమైన బిఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు నేతలతో ఆ బలాన్ని 28 కి పరిమితం చేసుకుంది.

ఇక ఇప్పుడు బిఆర్ఎస్ నుంచి మరో 5 ఎమ్మెల్యే లు బీజేపీ లో చేరబోతున్నారు అంటూ బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచందర్ రావు ప్రకటించడంతో, అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఆ సంఖ్య 23 కి చేరనుంది. దీనితో 2019 లో గులాబీ కారుతో పసుపు సైకిల్ కు తగిలిన దెబ్బ 23 గా భాదిస్తే…నేడు కాషాయ కమలం పిలుపులతో కేసీఆర్ గులాబీ కి మిగిలినబోతున్న రేకులు 23.?

అంటే 2023 లో జరిగిన ఎన్నికలకు చివరికి బిఆర్ఎస్ కి మిగలబోయే ఎమ్మెల్యేలు 23 కానున్నాయా.? ఆ 23 తో బిఆర్ఎస్ కర్మ ఫలం పూర్తి కానుందా.? ఈ రకంగా టీడీపీ తనకు జరిగిన నాటి అన్యాయానికి నేడు న్యాయం జరగబోతుందా.?

ఇది కూడా దేవుని స్క్రిప్ట్ లో భాగమే అవనుందా.? అన్న అనేక ప్రశ్నలు బీజేపీ నేతల ప్రకటనలతో, బిఆర్ఎస్ నాయకుల చర్యల పై ముడిపడి ఉన్నాయి. మొత్తానికి ఎదో ఒక రూపంలో 23 బిఆర్ఎస్ ను వెంటాడుతుందన్నమాట.

ADVERTISEMENT
Latest Stories